బిజినెస్

త్వరలో ఎన్‌ఎస్‌ఇ పబ్లిక్ ఇష్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ).. స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి బుధవారం సమర్పించింది. 10,000 కోట్ల రూపాయల సమీకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది ఎన్‌ఎస్‌ఇ. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి) ప్రకారం ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) పేరిట ఎన్‌ఎస్‌ఇలో ప్రస్తుతమున్న భాగస్వాములు తమ షేర్లలో 11 కోట్లకుపైగా షేర్లను ఈ ఐపిఒ ద్వారా అమ్మనున్నారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెబీకి తమ ఐపిఒ పత్రాలను దాఖలు చేసింది. కాగా, కోల్ ఇండియా తర్వాత ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ నిధుల సమీకరణతో స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్న సంస్థ ఎన్‌ఎస్‌ఇనే. కాగా, ఐపిఒ విజయవంతమైతే ఎన్‌ఎస్‌ఇ విలువ 50,000-55,000 కోట్ల రూపాయలకు చేరే అవకాశాలున్నాయ. ప్రస్తుతం దేశంలో స్టాక్ మార్కెట్లలో లిస్టయన ఎక్స్‌చేంజ్ కేవలం ఎమ్‌సిఎక్స్ మాత్రమే. త్వరలో బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ కూడా ఈ జాబితాలో చేరనున్నాయ.
స్వల్ప తేడాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు.. ముగింపు సమయానికి స్వల్ప తేడాతో మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 2.76 పాయింట్లు నష్టపోయి 26,210.68 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 8,034.85 వద్ద నిలిచింది. ఆరంభంలో సెనె్సక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్లు చొప్పున లాభాల్లో కదలాడాయి. అయితే గురువారంతో డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటం, విదేశీ మదుపరులు క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల మూడ్‌లో ఉండటం వంటివి సూచీలను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. దీంతో మంగళవారం భారీ లాభాలను అందుకున్న సూచీలు కాస్తా.. నష్టాలకు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 18 పైసలు కోలుకున్నా ఫలితం లేకపోయింది. అంతర్జాతీయంగా ప్రధాన ఆసియా మార్కెట్లలో చైనా, జపాన్ సూచీలు నష్టపోగా, హాంకాంగ్ సూచీ లాభపడింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్ నష్టపోగా, బ్రిటన్, జర్మనీలు లాభపడ్డాయి.

ఇఇఎస్‌ఎల్ లాభం రూ. 35 కోట్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రభుత్వరంగ సంస్థ.. ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్‌ఎల్) నికర లాభం క్రిందటి ఆర్థిక సంవత్సరం (2015-16) 35.59 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో ఇది 26.53 కోట్ల రూపాయలుగానే ఉంది. ఆదాయం ఈసారి 646.31 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఓ ప్రకటనలో ఇఇఎస్‌ఎల్ తెలిపింది. కాగా, 2015-16కుగాను 10.68 కోట్ల రూపాయల డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. 2014-15లో 2.72 కోట్ల రూపాయల డివిడెండ్‌నే ఇచ్చింది. ఎన్‌టిపిసి, పిఎఫ్‌సి, పవర్‌గ్రిడ్, ఆర్‌ఇసిఎల్ జాయింట్ వెంచరే ఇఇఎస్‌ఎల్.

ఎస్సార్ ఆయిల్‌కు రికార్డు లాభం
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఎస్సార్ ఆయిల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) రికార్డు స్థాయిలో నమోదైంది. అంతకుముందుతో పోల్చితే 42 శాతం పెరిగి 2,162 కోట్ల రూపాయలుగా ఉంది. గుజరాత్‌లోని వడినార్ వద్ద జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు భాగస్వాములకు ఎస్సార్ ఆయిల్ తెలిపింది. చమురు శుద్ధిపై పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయని, మునుపెన్నడూ లేనివిధంగా బ్యారెల్ ముడి చమురు శుద్ధికి 10.81 డాలర్ల ఆదాయం చేకూరిందని ఎస్సార్ ఆయిల్ వివరించింది. ఇక సంస్థ మొత్తం ఆదాయం 7,773 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు చెప్పింది.