బిజినెస్

గృహ రుణాల ఆశావహులు పెరిగారు: ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: వడ్డీరేట్లను తగ్గించిన నాటి నుంచి గృహ రుణాలపట్ల ఆసక్తి కనబరుస్తున్నవారు మూడింతలు పెరిగారని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత ఆదివారం గృహ, కార్పొరేట్ రుణాల వడ్డీరేట్లను ఎస్‌బిఐ తగ్గించినది తెలిసిందే. దీంతో ఈ వారం రోజుల్లో రుణాల కోసం సంప్రదిస్తున్నవారి సంఖ్య పెరిగిందని, ముఖ్యంగా గృహ రుణాల కోసం చాలామందే ప్రయత్నిస్తున్నారని శనివారం ఇక్కడ ఎస్‌బిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నిజానికి నవంబర్ 8న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డాక బ్యాంక్ రుణాల మంజూరు పడిపోయిందని ఎస్‌బిఐ నేషనల్ బ్యాంకింగ్ ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ రజ్నీశ్ కుమార్ విలేఖరులకు తెలిపారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గృహ, కార్పొరేట్ రుణాలను ఆశించేవారికి చేయూతనిస్తూ వడ్డీరేట్లపై రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో ఎస్‌బిఐ తమ ఎమ్‌సిఎల్‌ఆర్‌ను 90 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో రుణాల కోసం మళ్లీ ఆరా తీస్తున్నారని రజ్నీశ్ చెప్పారు.

హైకోర్టుకు 9నుంచి
సంక్రాంతి సెలవులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఈ నెల 9 (సోమవారం) నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ (జనరల్) నోటిఫికేషన్ విడుదల చేశారు. సెలవులు ఉన్నప్పటికీ 11న సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఉంటాయని తెలిపారు. ఇందుకు 9న కేసులు దాఖలు చేయవచ్చని, 11న అవి బెంచ్ ముందుకు వస్తాయన్నారు. సింగిల్ బెంచ్‌లో జస్టిస్ యు దుర్గాప్రసాద్, డివిజన్ బెంచ్‌లో జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ జి శ్యాం ప్రసాద్ ఉంటారని ఆయన వివరించారు. రిట్ పిటిషన్లను సింగిల్ బెంచ్ తీసుకుంటుందని, ఆ తర్వాత జస్టిస్ కోదండరామ్ సివిల్ కేసులను, జస్టిస్ శ్యాంప్రసాద్ క్రిమినల్ కేసులను విచారణకు తీసుకుంటారని తెలిపారు.

మహిళలపై లైంగిక దాడులు
మూడో స్థానంలో ఉమ్మడి ఏపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: దేశంలో యువతులను అక్రమంగా రవాణా చేసి రెడ్ లైట్ ఏరియాలకు పంపి లైంగిక దోపిడీకి పాల్పడుతున్న కేసుల వివరాలను నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో ప్రకటించింది. 2015లో అస్సాంలో 1,494 కేసులు, పశ్చిమబెంగాల్‌లో 1,255 కేసులు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు-ఆంధ్ర, తెలంగాణలో కలిపి 835 కేసులు నమోదైనట్లు ఎన్‌సిఆర్‌బి పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 274 కేసు లు, తెలంగాణలో 561 కేసులు నమోదయ్యాయి. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే, యువతుల లైంగిక దోపిడీకి సంబంధించి మానవ అక్రమ రవాణా కేసుల్లో మూడవ స్థానంలో నిలిచింది. తమిళనాడులో 577 కేసులు నమోదయ్యాయి. మానవ అక్రమ రవాణా నిరోధానికి హోంశాఖ, మాదకద్రవ్యాలు, నేరాల నిరోధానికి ఏర్పాటైన యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. ఇందు లో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎస్సై, సిఐ, డిఎస్పీ, ఐపిఎస్ అధికారులకు మానవ అక్రమ రవాణాను నిరోధించడంలో శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గోవా, ఢిల్లీ, పుణే, భివాండీకి చెందిన అమ్మాయిలను పట్టుకుని వారి పునరావాస సదుపాయానికి చర్యలు తీసుకున్నారు.