బిజినెస్

రాయితీపై పశుగ్రాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 7: చంద్రన్న దళితబాట, చంద్రన్న తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుకలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. రాయితీపై పశుగ్రాసాన్ని అందిస్తోందిప్పుడు. జన్మభూమి-మాఊరులో ‘ఇంటింటా పశుసంపద’ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ఆదరణ లభిస్తోంది. కుటుంబ వికాసమే-సమాజ వికాసం, సమగ్ర రాష్ట్ర వికాసమే-సంపూర్ణ దేశ వికాసం.. పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమంలో 15 ముఖ్యమైన అంశాలపై ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాల కింద ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను కూడా ప్రభుత్వం అందిస్తోంది. లక్షలాది మంది రైతులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోడానికి ముందుకొస్తున్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు రైతుల జీవన విధానంలో అంతర్భాగం. గ్రామీణ ప్రాంతాల ప్రజలు నెలకు కనీసం 10 వేల రూపాయల ఆదాయాన్ని పశువుల పెంపకం ద్వారానే పొందేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇందుకు అవసరమైన ఆర్థిక, ఇతర సహాయ కార్యక్రమాలు కూడా చేపడుతోంది. దేశవాళీ ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కొన్ని దేశవాళీ మేలుజాతి ఆవుల్ని కొనుగోలు చేసి తెచ్చుకోవడానికి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. వీటి బీమాకు అవసరమైన ఆర్థిక సాయాన్నీ అందజేస్తోంది. అలాగే మేకలు లేదా గొర్రెలు కనీసం 20 వరకు కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తోంది.
మరోవైపు ‘చంద్రన్న కోడి’ పేరుతో సగం రేటుకే 45 కోళ్లను కొనుగోలు చేసి పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన రైతులు, ముఖ్యంగా మహిళలను ఈ పథకాలకు ఎంపిక చేసి వారికి చేయూతనివ్వడంలో పశు సంవర్ధక శాఖ అధికారులు విస్తృత కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని లక్షలాది మంది రైతులు, మహిళలు పశువులు, కోళ్లు కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. వాటిద్వారా ఏటా లక్షలాది రూపాయల ఆదాయం కూడా గడిస్తున్నారు. పశువులకు కావాల్సిన పశుగ్రాసాన్ని 50 శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తోంది ప్రభుత్వం. కిలో ఆరు రూపాయలకు పైగా పలుకుతున్న పశుగ్రాసాన్ని మూడు రూపాయలకే ఇ స్తోంది.
సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించేందుకు పశుమిత్ర, జీవన్‌మిత్ర పేరుతో రెండు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పశుమిత్ర కింద ఆవులు, గేదెలకు 50 శాతం సబ్సిడీతో పశుగ్రాసం అందిస్తుంటే, జీవన్‌మిత్ర కింద మేకలు, గొర్రెలకు పశుగ్రాసాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన జన్మభూమి సభల్లో పశుమిత్ర కింద లక్షా 72 వేల 289 పశువులకు, జీవన్‌మిత్ర కింద 82 వేల 904 మేకలు లేదా గొర్రెలకు పశుగ్రాసాన్ని అందజేశారు. గ్రామాల్లో పశువైద్య శిబిరాలు కూడా భారీగా నిర్వహిస్తున్నారు. నాలుగో విడత జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు 10 వేలకుపైగా పశువైద్య శిబిరాలు నిర్వహించగా, శనివారం ఒక్కరోజే రాష్టవ్య్రాప్తంగా 900 పశువైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో ఇప్పటివరకు 10 లక్షల పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, శనివారం ఒక్కరోజే దాదాపు 90 వేల పశువులకు వైద్య పరీక్షలు జరిపారు.