బిజినెస్

జియో ఉచిత ఆఫర్లపై టిడిశాట్‌కు ఐడియా సెల్యులార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: రిలయన్స్ జియోపై ప్రత్యర్థి సంస్థలు ఒక్కొక్కటిగా టెలికామ్ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (టిడిశాట్)ను ఆశ్రయిస్తున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంచలన టెలికామ్ సంస్థ 4జి సేవలను దేశవ్యాప్తంగా ఉచితంగానే అందిస్తున్నది తెలిసిందే. అయితే ఈ ఉచిత ఆఫర్‌ను తొలుత గత నెల డిసెంబర్ 31 వరకే ప్రకటించిన జియో.. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 31దాకా పొడిగించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ పేరిట కొత్త కస్టమర్ల కోసం, వీరితోపాటు పాత కస్టమర్లకూ ఉచిత 4జి సేవలను మరో మూడు నెలలు ప్రకటించింది. దీనిపై ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్ టిడిశాట్‌కు వెళ్లగా, ఇప్పుడు ఐడియా సెల్యులార్ కూడా అదే దారిలో నడిచింది. 90 రోజులకు మించి జియో ఉచిత ఆఫర్‌ను కొనసాగించడానికి టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ అనుమతించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిడిశాట్‌లో ఐడియా పిటిషన్ వేసింది. జియో ప్రమోషన్ ఆఫర్‌ను నిలిపివేయాలని అందులో కోరింది. నిరుడు సెప్టెంబర్ 4న జియో 4జి సేవలు మొదలైనది తెలిసిందే. కాగా, ఎయిర్‌టెల్ పిటిషన్‌తోపాటు, ఐడియా పిటిషన్‌లపై వచ్చే నెల ఫిబ్రవరి 1న టిడిశాట్ విచారణ జరపనుంది.
మరోవైపు జియో టారీఫ్ ప్లాన్లపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని ట్రాయ్ కోరుతోంది. జియో ఉచిత కాల్, డేటా ఆఫర్లపై ప్రత్యర్థి సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత న్యాయ సలహాదారైన అటార్నీ జనరల్ సాయాన్ని తీసుకుంటోంది ట్రాయ్. జియో ఉచిత ఆఫర్లతో తమకు భారీ నష్టం వాటిల్లుతోందని, జియో తీరు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రత్యర్థి టెలికామ్ సంస్థలు ఆక్షేపిస్తున్నాయి. జియో ఉచిత ఆఫర్ పొడిగింపునకు ట్రాయ్ అనుమతించడాన్నీ తప్పుబడుతున్నాయి. జియో ఉచిత ఆఫర్‌తో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థల ఆదాయం పెద్ద ఎత్తున పడిపోగా, కస్టమర్ల సంఖ్య కూడా తగ్గిపోతోంది. జియోకు ధీటుగా కాల్స్, డేటా చార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నా ఫలితం ఉండటం లేదు.