బిజినెస్

టిటిడికి నోట్ల రద్దు సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/తిరుమల, ఫిబ్రవరి 18: పాత పెద్ద నోట్ల రద్దు సెగ.. తిరుమల తిరుపతి దేవస్థానాని (టిటిడి)కీ తగిలింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం.. టిటిడి ఆదాయానికి గండి కొట్టింది. రోజుకు దాదాపు 5 కోట్ల రూపాయలుగా ఉండే టిటిడి ఆదాయం.. నోట్ల రద్దు కారణంగా 2 కోట్ల రూపాయల మేర తగ్గిపోయింది మరి. నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను తెస్తున్నామని తెలిపిన ఆయన రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లను పొందవచ్చని చెప్పారు. ఈ క్రమంలో టిటిడికి భక్తుల రద్దీ తగ్గిపోగా, పెరిగిన చిల్లర కష్టాలతో ఆదాయం క్షీణించింది. చాలామంది రద్దయిన నోట్లను పెద్ద ఎత్తున హుండీల్లో కూడా వేసినది తెలిసిందే. ఇదంతా కూడా టిటిడికి దక్కని ఆదాయమే. పాత పెద్ద నోట్ల రద్దు జరిగి ఇప్పటికి 100 రోజులు పూర్తయింది. అయినా ఆ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. దీంతో క్షీణించిన ఆదాయాన్ని పెంచే దిశగా టిటిడి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీవారి దర్శనం టిక్కెట్లతోపాటు ఇతరత్రా సేవల ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. భక్తులపై భారం పడకుండా చూస్తామంటూనే ఆర్జిత సేవల ధరలను పెంచాలని టిటిడి భావిస్తుండటం గమనార్హం. బ్యాంకుల్లోని బంగారం, నగదు డిపాజిట్లపై వచ్చే ఆదాయం, దైవ దర్శనానికి, ఇతరత్రా సేవల కోసం విక్రయించే టిక్కెట్లు, ప్రసాదాల అమ్మకాలపై వచ్చే రాబడి పాత పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజూ 5 కోట్ల రూపాయల వరకు ఉండేదని టిటిడి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడిది 3 కోట్ల రూపాయలను మించ డం లేదని అంటున్నాయి. నిజానికి ఆర్జిత సేవల ధరలను పెంచాలని ప్రతిపాదించిన టిటిడి.. ఇదివరకే ఓసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియపరిచినా అందుకు ఆయన అంగీకరించలేదు. అయితే పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో తగ్గిన ఆదాయం దృష్ట్యా ధరల పెంపు అనివార్యమే అయ్యేలా ఉందని, అలాకానిపక్షంలో రెవిన్యూ లోటును పూడ్చలేమని టిటిడి అంటోంది. దీంతో త్వరలో ఏడు కొండలవాడి దర్శనం మరింత ప్రియం కానుందనే సంకేతాలను ఇస్తోంది. ఓ పత్రికా విలేఖరితో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఈ మేరకు మాట్లాడారు. కాగా, ప్రస్తుతం టిటిడి టిక్కెట్ల ధరలు 50 నుంచి 5,000 రూపాయల వరకు ఉన్నాయి. వీటిలో దైవ దర్శనంతోపాటు ఇతరత్రా పూజాధికాల సేవలున్నాయి. ఇక చాలామంది భక్తులు 300 రూపాయల టిక్కెట్‌తో ప్రత్యేక దర్శనానికి వెళ్తుండగా, రోజుకు కనీసం 2 వేల మంది 500 రూపాయల టిక్కెట్‌తో విఐపి దర్శనానికి వెళ్తుంటారు. ఇదిలావుంటే 5 నుంచి 10 రూపాయల మేర వివిధ రకాల టిక్కెట్ల ధరలను టిటిడి పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ఉన్నది తెలిసిందే. ఎస్‌బిఐసహా వివిధ జాతీయ బ్యాంకుల్లో భారీగా పసిడి డిపాజిట్లు టిటిడికి ఉన్నాయి.