బిజినెస్

జిడిపి తెచ్చిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 1: జిడిపి గణాంకాలు అందించిన ఉత్సాహంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకుని లాభాల బాట పట్టాయి. బుధవారం ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 6 నెలల గరిష్ఠాన్ని తాకితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,900 మార్కును అధిగమించింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను జిడిపి గణాంకాలను మంగళవారం సాయంత్రం విడుదల చేసినది తెలిసిందే. 7 శాతంగా ఇవి నమోదు కావడంతో మదుపరులు పెట్టుబడులతో ముందుకొచ్చారు. రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల కొనుగోలుకు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 241.17 పాయింట్లు పుంజుకుని 28,984.49 వద్ద ముగియగా, నిఫ్టీ 66.20 పాయింట్లు అందుకుని 8,945.80 వద్ద నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదు కావచ్చని కూడా సిఎస్‌ఒ అంచనా వేసినది తెలిసిందే. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో కీలక సూచీలైన హాంకాంగ్, జపాన్, చైనా సూచీలు లాభపడగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభాల్లో కదలాడాయి.
రికార్డు స్థాయికి బిఎస్‌ఇ మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: మరోవైపు బుధవారం మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేయడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ)లోని సంస్థల మార్కెట్ విలువ రికార్డు స్థాయికి చేరింది. బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ 118 లక్షల కోట్ల రూపాయలకుపైగా నమోదైంది. గత రెండు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగియగా, బిఎస్‌ఇ సూచీ సెనె్సక్స్ 149.65 పాయింట్లు కోల్పోయింది. అయితే బుధవారం 241 పాయింట్లు పెరగడంతో మార్కెట్ విలువ కూడా 1,18,19,635 కోట్ల రూపాయల (1.7 ట్రిలియన్ డాలర్లు)ను తాకింది. జాతి విద్వేషాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వలస విధానంపై మెతక వైఖరిని ప్రదర్శించడం ఐటి షేర్లకు లాభాలను తెచ్చిపెట్టింది.
కళకళలాడిన అమెరికా మార్కెట్లు
న్యూయార్క్: ఇదిలావుంటే బుధవారం అమెరికా మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. అమెరికా సూచీలు సరికొత్త స్థాయిలను అందుకున్నాయి. డోజోన్స్ తొలిసారిగా 21 వేల స్థాయిని అధిగమించింది. ఒక శాతం వృద్ధితో 21,026.20 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్ సైతం 0.8 శాతం ఎగిసి 5,871.10 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పి 500 సూచీ 0.9 శాతం ఎగబాకి 2,383.81 స్థాయికి చేరింది. వలస విధానంపై గతంలో కనబరిచిన తన కఠిన వైఖరి విమర్శల పాలవుతుండటంతో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించడం వల్ల మదుపరులు పెట్టుబడులతో కదం తొక్కారు.