బిజినెస్
సరళతరం కానున్న ఇపిఎఫ్‌ఒ, ఇఎస్‌ఐసి సభ్యత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 March 2017
న్యూఢిల్లీ, మార్చి 5: ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్‌ఒ, ఉద్యోగ ఆరోగ్య బీమా ఇఎస్‌ఐసిల్లో చేరికకు ఆయా సంస్థలు ఇక కేవలం ఒకే ఒక్క ఫామ్ నింపితే సరిపోతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇపిఎఫ్‌ఒ, ఇఎస్‌ఐసి సభ్యత్వానికి సంస్థలు చాలా రకాల పేపర్లను సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో మొత్తం ఈ ప్రక్రియను సరళతరం చేయాలని భావిస్తోంది సర్కారు. సింగిల్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ను పరిచయం చేయాలనుకుంటోంది. 20 అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు ఇపిఎఫ్‌ఒ, 10 అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు ఇఎస్‌ఐసి సౌకర్యాన్ని పొందేందుకు అర్హులు. ఇఎస్‌ఐసి సేవలకైతే వేతన పరిమితి కూడా ఉంటుంది.