బిజినెస్

తెలంగాణ బాండ్లకు భలే డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: సెక్యూరిటీ మార్కెట్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కాంల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వారా వేలం వేసిన బాండ్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. తెలంగాణ డిస్కాంలను నష్టాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్లను విడుదల చేసింది. మొత్తం రూ. 8,923 కోట్ల విలువైన బాండ్లను వేలం వేయగా, రూ. 7,120 కోట్ల బాండ్లు అమ్ముడయ్యాయి. బాండ్లకు ఏ రేటింగ్ లభించింది. ఈ బాండ్లను విక్రయించగా వచ్చిన సొమ్ముతో డిస్కాంలు తీసుకున్న రుణాలను తీరుస్తారు. మొత్తం 70 శాతం విలువైన బాండ్లు అమ్ముడయ్యాయి. మిగిలిన రూ. 1,803 కోట్ల సెక్యూరిటీ బాండ్లను ఈ నెల 23వ తేదీన వేలం వేస్తారు. ఫైనాన్స్ మార్కెట్లు జోరుగా లేకపోయినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రెవెన్యూ వనరులు ఇతర రాష్ట్రాలతో పోల్చితే పటిష్టంగా ఉండడం వల్ల ఆర్థిక ఏజన్సీలు కొనుగోలుకు పోటీపడ్డాయి. పెట్టుబడుల ఖర్చులో రుణం వాటా తక్కువగా ఉండడం కూడా తెలంగాణ బాండ్లకు ఆదరణ పెరిగేందుకు కారణమని ఆర్థిక శాఖ వర్గాలు విశే్లషిస్తున్నాయ. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా బాగా ఖర్చుపెట్టడం వల్ల ఇనె్వస్టర్లు తెలంగాణ బాండ్ల కొనుగోలుకు ఆసక్తి కనపరిచారు. దేశంలో 19.2 శాతం వరకు వృద్ధిరేటును సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. 2016-17లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి రూ. 6,70,756 కోట్లుగా ఉంది. 2015-16తో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. ఆర్థిక రంగంలో సేవా రంగం వాటా 63 శాతం, తయారీ రంగం వాటా 24 శాతం, వ్యవసాయం వాటా 13 శాతంగా ఉంది. రుణాలు మినహాయిస్తే రెవెన్యూ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటడం కూడా తెలంగాణ ఆర్థిక పరిపుష్ఠిని విశ్వసించి బాండ్ల కొనుగోలుకు పోటీపడ్డారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.