బిజినెస్

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చే మహిళలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పరిశ్రమ భవన్‌లో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తల కోసం సుల్తాన్‌పూర్, తుప్రాన్, నందిగామల్లో ఇండస్ట్రీ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
డిజిటల్ తెలంగాణకు కృషి: జయేష్ రంజన్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి డిజిటల్ అభివృద్ధి ఫలాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఐటి, కమ్యూనికేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. డిజిటల్ సాంకేతిక విప్లవం పట్ల అవగాహన కల్పించడం, చిన్న వ్యాపారులకు సాంకేతికత అభివృద్ధిని అందించడం, రైతులకు అవసరమైన శాస్ర్తియ సహకారాన్ని కల్పించే దిశగా డిజిటల్ తెలంగాణ అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. బుధవారం ఇక్కడ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. కాగా, ఈ సమ్మిట్‌లో ఇండియన్ ఆర్మీ లెఫ్ట్‌నెంట్ జనరల్ సుబ్రతా సాహ కీలకోపన్యాసం చేశారు. భారతీయ సైనికా దళానికి ఆధునిక సాంకేతికతతో కూడిన పరిశ్రమల అవసరం చాలా ఉందన్నారు.
తెలంగాణ సిఐఐ చైర్మన్‌గా రాజన్న
సిఐఐ తెలంగాణ విభాగానికి వచ్చే 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను కొత్త చైర్మన్, వైస్ చైర్మన్లను బుధవారం ఎన్నుకున్నట్లు సిఐఐ తెలిపింది. చైర్మన్‌గా వి రాజన్న, వైస్ చైర్మన్‌గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కార్యవర్గంలో రాజన్న ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సంజయ్ సింగ్ ఐటిసిలో ప్రింటింగ్, ప్యాకేజి వ్యవహారాలను చూస్తున్నారు. ఆయన సిఐఐ తెలంగాణ విభాగంలో, అంతకు ముందు ఎపి సిఐఐలో సభ్యుడిగా కీలకపాత్ర పోషించినట్లు సిఐఐ వెల్లడించింది.