బిజినెస్

దూసుకుపోతున్న జల రవాణా ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 11: కేంద్ర జల రవాణా ప్రాజెక్టు భూసేకరణ దశకు చేరింది. బకింగ్‌హామ్ కెనాల్ నుంచి ఇటు పుదుచ్చెరి వరకు ఇప్పటికే సర్వే పూర్తికావడంతో ప్రస్తుతం భూసేకరణపై దృష్టి సారించారు. జల వనరుల శాఖ ఎల్‌పి షెడ్యూలు సిద్ధం చేస్తోంది. ఈ షెడ్యూలు ప్రకారం రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ నోటిఫికేషన్‌కు కసరత్తు మొదలుపెట్టింది.
నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఇప్పటికే సర్వే పూర్తయింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో భూసేకరణకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం సుమారు 1,290 ఎకరాలు అవసరమవుతుందని గుర్తించారు. ఈ భూములకు సంబంధించి జల వనరుల శాఖ ఎల్‌పి షెడ్యూలు సిద్ధంచేసి రెవెన్యూ శాఖకు సమర్పిస్తుంది. ఈ నెలాఖరు నుంచి భూసేకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ధవళేశ్వరం నుంచి కాకినాడ వరకు ప్రధాన కాల్వ వెంబడి జరిగే పనులకు సంబంధించి 30 గ్రామాల పరిధిలో సుమారు 390 ఎకరాల వరకు ప్రైవేటు భూమి అవసరమవుతుందని గుర్తించారు. ఇది కాకుండా దాదాపు 900 ఎకరాల వరకు జల వనరుల శాఖకు చెందిన భూములు అవసరమని గుర్తించారు. ముందుగా ప్రస్తుత కాల్వలను విస్తరించడానికి చర్యలు చేపట్టారు. గమన దిశలు పూర్తిచేసి, అవసరమైన భూములను సేకరించిన అనంతరం పనులు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. జల రవాణా ప్రాజెక్టులో సముద్రం అనుసంధానంగా సామర్లకోట కెనాల్ విస్తరణ చేపట్టాల్సి ఉంది.
ప్రస్తుతం సీ వౌత్‌ను విస్తరించి పడవలు సముద్రంలోకి చేరేవిధంగా ఎక్కడికక్కడ డిపిఆర్‌లు రూపొందించాల్సి ఉంటుంది. జల రవాణా మార్గంలో కృష్ణా, గోదావరి నదులను అనుసంధానంగా ముందుగా సామర్లకోట కెనాల్‌ను విస్తరించడానికి చర్యలు చేపట్టనున్నారు. కాకినాడ నుంచి ధవళేశ్వరం, ధవళేశ్వరం నుంచి భద్రాచలం వరకు, ధవళేశ్వరం నుంచి ఏలూరు, ఏలూరు నుంచి విజయవాడ, అక్కడి నుంచి రాజధానికి అనుసంధానం చేస్తూ జల రవాణా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో గమన దిశల్లో పనులు జరుగుతున్నాయి.
మొదటి దశలో ఎల్‌పి షెడ్యూల్‌ను జల వనరుల శాఖ ఎక్కడికక్కడ నివేదికలు తయారుచేసి రెవెన్యూకు సమర్పించే పని చేపట్టింది. సముద్రాన్ని అనుసంధానం చేస్తూ కృష్ణా, గోదావరి నదుల మధ్య జల రవాణా జరిగేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. గమన దిశలో పరీవాహ ప్రాంతంలో ఉన్న సరుకులను తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనంగా ఉంటుంది. రెండు నదుల్లో సరుకుల రవాణా కోసం బోట్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు బొగ్గు, స్టీలు, సిమెంట్, సున్నపురాయి ఎగుమతి జరగనుంది. రాష్ట్రానికి పర్యాటకం ద్వారా కూడా మంచి ఆదాయం లభించనుంది. ఈ నాల్గవ అంతర్గత జల రవాణా ప్రాజెక్టును వాటర్‌వేస్ అథారిటీ చేపట్టింది. నల్లగొండ జిల్లా వజీరాబాద్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వరకు గల 157 కిలోమీటర్లు, ధవళేశ్వరం నుంచి భద్రాచలం వరకు 171 కిలోమీటర్ల పొడవున ముందుగా పనులు చేపడతారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వను కూడా జల రవాణా ప్రాజెక్టులో అంతర్భాగంగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించారు.