బిజినెస్

ప.గో. సిగలో వెమ్ ఏరోసిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 11: పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి జిల్లా కేంద్రం ఏలూరులోని సర్ సిఆర్‌ఆర్ కళాశాలలో చదువుకుని, అంచెలంచెలుగా ఎదిగిన తాను ఏలూరు సమీపంలో వెమ్ ఏరోసిటీ ఏర్పాటుద్వారా జిల్లా రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆ సంస్థ సిఎండి వి వెంకట్రాజు పేర్కొన్నారు. పెదపాడు మండలం వట్లూరు వద్ద వెమ్ ఏరోసిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. 2 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ ఏరోసిటీలో డిఫెన్స్, ఏరోస్పేస్‌కు సంబంధించిన పరికరాలను తయారుచేయనున్నారు. బ్రహ్మోస్ క్షిపణి, రాకెట్ లాంచర్లు, బాంబుల తయారీకి సంబంధించి కీలకమైన పరికరాల రూపకల్పనతో ఏరోసిటీకి ప్రాధాన్యత లభించనుంది. డిఫెన్స్ టెక్నాలజీ విషయంలోనూ పశ్చిమకు ఏరోసిటీ ద్వారా ప్రాధాన్యత లభించనుంది. అంతేగాకుండా ఏరోసిటీలో ఏటా 350 మందికి నైపుణ్యాభివృద్ధిలో అవసరమైన శిక్షణ అందిస్తామని సిఎండి వెంకట్రాజు తెలిపారు. రానున్న రోజుల్లో వెమ్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్నదే తన దీర్ఘకాలిక కలగా ఉందని వివరించారు. కాగా, మిగిలిన సంస్థలతో పోలిస్తే తమ సంస్థలో వెయ్యి మంది పనివారికి 500 మంది ఇంజనీర్లు ఉంటారని, డిఫెన్స్ రంగంలో ఉన్నందున ఇక్కడ అంత సులభంగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రాకపోయినా నైపుణ్యాభివృద్ధి విషయంలో యువతకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. దీనివల్ల మిగిలినచోట్ల వారికి ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవటంలో ఫ్లస్ పాయింట్‌గా మారుతుందని చెప్పారు. వెమ్ ఏరోసిటీలో ఉద్యోగం పొందాలంటే యువత ట్రాక్ రికార్డు చక్కగా ఉండాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వెమ్ ఏరోసిటీ విజయవంతంగా నడుస్తోందని, ఇక్కడ కూడా దాన్ని త్వరితగతిన ఏర్పాటుచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వెమ్ ఏరోసిటీ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నివిధాలా సహకరించారని, ఇదే సమయంలో తన నియోజకవర్గ పరిధిలో ఇంత భారీ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు, జిల్లా యంత్రాంగానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

వెమ్ ఏరోసిటీ సిఎండి వి వెంకట్రాజు