బిజినెస్

యుపి విజయం... సంస్కరణలకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపు మరిన్ని సంస్కరణలకు ఊతమివ్వగలదన్న అభిప్రాయాన్ని భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలు వ్యక్తం చేశాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఫలితాలు విడుదలైయ్యాయి. ఇందులో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ లభించింది. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్‌లోనూ మోదీ హవా కొనసాగగా, పంజాబ్‌ను మినహాయిస్తే గోవా, మణీపూర్‌లలో ఇతరుల సాయంతో అధికారం చేపట్టడానికి అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింతగా సమన్వయం పెరగగలదన్న ఆశాభావాన్ని పారిశ్రామిక, వ్యాపార వర్గాలు వెలిబుచ్చాయి. అసోచామ్ అధ్యక్షుడు సందీప్ జజోడియా మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో, కేంద్రంలో ఒకే పార్టీలు అధికారంలో ఉండటం వల్ల సత్వర నిర్ణయాలకు వీలుంటుందని, సంస్కరణల అమలులో ప్రభుత్వానికి బలం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రంలో ఒకే పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉండటం వల్ల అన్ని రకాల సంస్కరణల అమలు వేగంగా ఉంటుందని అన్నారు. చట్టసభల్లో బిల్లులకు సులభంగా ఆమోదాలు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల మద్దతు ఉంటుందన్న ఆయన ప్రస్తుతం దేశంలోని అధిక రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా బిజెపి ఖాతాలోకి రావడంతో ఇది అభివృద్ధికి ఊతమిచ్చేదే అన్నారు. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చే వారం లాభాల్లో పరుగులు పెట్టవచ్చన్న అంచనాను మహీంద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ముఖ్యంగా రాజ్యసభలో మోదీ సర్కారు బలం పెరగడం వల్ల ఆర్థిక సంస్కరణలకు ఇక కొదవుండదనే అభిప్రాయం మదుపరుల్లో ఉందన్నారు. లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న బిజెపికి.. రాజ్యసభలో లేకపోవడంతో కీలకమైన బిల్లుల ఆమోదం ఆలస్యమవుతోంది. అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం దక్కడంతో రాజ్యసభలో బిజెపికి సభ్యులు పెరగనున్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఆలస్యానికి కూడా రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం, రాష్ట్రాల మద్దతు లభించకపోవడమే కారణం అన్నది తెలిసిందే. దీంతో తాజా ఫలితాలు మదుపరుల పెట్టుబడులను తప్పక ఆకర్షిస్తాయని ఆనంద్ మహీంద్ర అన్నారు. సిఐఐ సైతం ఇదే అభిప్రాయాన్ని కనబరిచింది.

సిసిఎల్ బైబ్యాక్ ఆఫర్ లేనట్లే
న్యూఢిల్లీ, మార్చి 11: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సిసిఎల్).. 1,001.8 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదిత బైబ్యాక్ ప్లాన్‌ను చేపట్టబోవడం లేదని శనివారం స్పష్టం చేసింది. తొలుత సిసిఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ బైబ్యాక్ ఆఫర్‌కు ఆమోదం తెలిపినప్పటికీ, పలు ఆర్థికపరమైన కారణాల దృష్ట్యా దాన్ని విరమించుకున్నారని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు శనివారం కోల్ ఇండియా తెలిపింది.

‘రియల్’ నిర్వహణకు ఎస్‌బిఐ ప్రత్యేక సంస్థ
న్యూఢిల్లీ, మార్చి 11: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. నిర్మాణరంగ లావాదేవీలు, కార్యకలాపాల నిర్వహణార్థం ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఎస్‌బిఐ ఇన్‌ఫ్రా మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌బిఐఐఎమ్‌ఎస్) పేరిట ఈ సంస్థను తీసుకొచ్చింది. దీనివల్ల నాన్-కోర్ వ్యాపారాల బాధ్యతను చూస్తున్న తమ బ్యాంక్ ఉద్యోగుల సమయం చాలావరకు ఆదా అవుతుందని ఎస్‌బిఐ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ ఉద్యోగుల సేవలను కోర్ బ్యాంకింగ్ సేవల కోసం వినియోగిస్తామని వివరించింది. నాన్-కోర్ కార్యకలాపాలను 1,100 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది.