బిజినెస్

శ్రీసిటిని సందర్శించిన కొరియా కాన్సుల్ జనరల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఏప్రిల్ 7: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో వెలసిన శ్రీసిటి పారిశ్రామిక వాడను చెన్నైలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ కిమ్ యుంగ్ తే శుక్రవారం సందర్శించారు. ఆయనకు శ్రీసిటి అధ్యక్షుడు రమేష్ సుబ్రమణ్యం సాదరంగా స్వాగతం పలికి ఇక్కడి వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా యుం గ్ తే మ్లాడుతూ శ్రీసిటిలో స్నేహపూ ర్వక వ్యాపార వాతావరణం తనకు బాగా నచ్చిందని, త్వరలోనే దేశ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందగల దన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 కొరియన్ కంపెనీలు ఏర్పాటు కావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. శ్రీసిటి ప్రతినిధులతో కలసి సెజ్‌లో ఉన్న వెర్మరీన్ పరిశ్రమను సందర్శించి అక్కడ జరిగే ఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీసిటి ఎండి రవీంద్ర సనారెడ్డి మాట్లాడుతూ యుంగ్ తే పర్యటన ఇక్కడ మరిన్ని పరిశ్రమల రాకకు దోహద పడగల దన్నారు.

ఎల్‌అండ్‌టి కొత్త సిఇఒగా సుబ్రమణియన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) సిఇఒగా శుక్రవారం ఎస్‌ఎన్ సుబ్రమణియన్ ఎన్నికయ్యారు. జూలై నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. కాగా, సుదీర్ఘకాలం సంస్థకు సేవలందించిన ఎఎమ్ నాయక్ అక్టోబర్ 1 నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారని స్పష్టం చేసింది. ఈ మార్పులకు శుక్రవారం ఎల్‌అండ్‌టి బోర్డు ఆమోదం తెలిపింది. 52 ఏళ్లకుపైగా ఎల్‌అండ్‌టిలో వివిధ హోదాల్లో పనిచేసిన నాయక్.. 17 ఏళ్లకుపైగా కాలం నుంచి సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. 1999లో సిఇఒ, ఎండిగా ఎన్నికైన ఆయన 2003లో చైర్మన్‌గా నియమితులయ్యారు.

6 లక్షలకుపైగా జెఎల్‌ఆర్ అమ్మకాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్).. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 6,04,009 యూనిట్ల అమ్మకాలను జరిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే ఇది 16 శాతం అధికం. కాగా, తొలిసారి ఒక ఏడాది కాలంలో 6 లక్షలకుపైగా విక్రయాలను నమోదు చేసినట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ శుక్రవారం తెలిపింది. ఇక మార్చితో ముగిసిన త్రైమాసికంలో 1,79,509 యూనిట్ల అమ్మకాలు జరిగాయని, కేవలం మార్చిలో 90,838 యూనిట్లను విక్రయించామని చెప్పింది.

20 నెలల గరిష్ఠానికి రూపాయ విలువ
ముంబయ, ఏప్రిల్ 7: డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ శుక్రవారం ఫారెక్స్ మార్కెట్‌లో 20 నెలల గరిష్ఠ స్థాయని అందుకుంది. గురువారం ముగింపుతో చూస్తే 24 పైసలు బలపడి 64.28 వద్ద నిలిచింది. అంతకుముందు రెండు రోజుల్లోనూ 51 పైసలు ఎగిసింది. కాగా, సిరియాపై అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలోనూ ట్రేడర్లు, ఎగుమతిదారులు డాలర్ల అమ్మకానికి పెద్దపీట వేయడం గమనార్హం.