బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐసిఐసిఐ బ్యాంక్
ముంబయ/న్యూఢిల్లీ, మే 3: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ఐదింతలు పెరిగి 2,024.64 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 701.89 కోట్ల రూపాయలుగానే ఉంది. ఆదాయం ఈసారి 16,585.76 కోట్ల రూపాయలుగా, పోయినసారి 18,590.86 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఎస్‌బిఐ లైఫ్
ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 336 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 256 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,213 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,586 కోట్ల రూపాయలుగా ఉంది.
డిహెచ్‌ఎఫ్‌ఎల్
డిహెచ్‌ఎఫ్‌ఎల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 248 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 190 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,218 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,969.43 కోట్ల రూపాయలుగా ఉంది.
జెఎమ్ ఫైనాన్షియల్
జెఎమ్ ఫైనాన్షియల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 210.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. రుణ వ్యాపారం 10 వేల కోట్ల రూపాయల మార్కును దాటి 11,343 కోట్ల రూపాయలను తాకాయ. మొండి బకాయలేవి లేవని సంస్థ పేర్కొంది.
శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్
ఎన్‌బిఎఫ్‌సి సంస్థ శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 149.63 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 143.92 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,712.31 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,930.20 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
బయోకాన్
హెల్త్‌కేర్ సంస్థ బయోకాన్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 148.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 354.4 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 58 శాతం తగ్గినట్లైంది. మరోవైపు ఆదాయం ఈసారి 974.3 కోట్ల రూపాయలుగా, పోయినసారి 972. 7 కోట్ల రూపాయలుగా ఉందంది.
టివిఎస్ మోటార్
ఆటోరంగ సంస్థ టివిఎస్ మోటార్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 126.77 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 136.03 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 3,139.22 కోట్ల రూపాయలుగా, పోయినసారి 3,090.77 కోట్ల రూపాయలుగా ఉంది.
టాటా ఎల్సీ
డిజైన్ సర్వీసెస్ ప్రొవైడర్ టాటా ఎల్సీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 44.49 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 41.08 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 8.2 శాతం పెరిగింది. ఆదాయం ఈసారి గతంతో పోల్చితే దాదాపు 10 శాతం పెరిగి 323.96 కోట్ల రూపాయలుగా ఉంది.
మోర్పెన్ ల్యాబ్స్
మోర్పెన్ లాబొరేటరీస్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 7.72 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు (2015-16) జనవరి-మార్చిలో 2.76 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 142.95 కోట్ల రూపాయలుగా, పోయినసారి 123.59 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
భారత్ ఫైనాన్షియల్
సూక్ష్మ రుణాల సంస్థ భారత్ ఫైనాన్షియల్ (ఎస్‌కెఎస్ మైక్రోఫైనాన్స్) నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 234.92 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 84.47 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది ఆదాయం ఈసారి 409.31 కోట్ల రూపాయలుగా, పోయనసారి 370.31 కోట్ల రూపాయలుగా ఉందంది. 334.56 కోట్ల రూపాయల రుణాల రద్దు వల్లే నష్టాలని పేర్కొంది.