బిజినెస్

మార్కెట్‌లోకి సరికొత్త బ్రెడ్ ఉత్పత్తులు .. విడుదల చేసిన మోడ్రన్ ఫుడ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: మార్కెట్‌లోకి సరికొత్త రూపుతో బ్రెడ్ ఉత్పత్తులను విడుదల చేసింది మోడ్రన్ ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. నూతన బ్రాండ్ పొజిషనింగ్‌తో, ఐడెంటిటీతో, ఆకట్టుకునే ప్యాకేజింగ్‌తో అత్యున్నత శ్రేణి ఉత్పత్తులతో తమ ఫుడ్ పోర్ట్ఫోలియోను పెంచుకుంటోంది. వినియోగదారులకు ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారోత్పత్తులను అందించడానికే తమ తొలి ప్రాధాన్యతని తెలిపిన మోడ్రన్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో 25 శాతం అధిక ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. 2021 నాటికి 1,000 కోట్ల రూపాయల రెవిన్యూను అందుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో వ్యాపార విస్తరణపైనా దృష్టి సారించామని, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మార్కెట్‌లో సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని మోడ్రన్ ఫుడ్ సిఇఒ, బోర్డు సభ్యుడైన అసీమ్ సోని స్పష్టం చేశారు. ప్రస్తుతం 80 వేలుగా ఉన్న రిటైల్ స్టోర్లను వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా లక్షకు పెంచుతామని కూడా ఆయన చెప్పారు. కాగా, నిరుడు ఏప్రిల్‌లో హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) నుంచి మోడ్రన్ ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఎవర్‌స్టోన్ క్యాపిటల్ కొనుగోలు చేసినది తెలిసిందే. వివిధ రకాల బ్రెడ్లతోపాటు రస్కులు, కేకులు, మప్పిన్స్, బన్స్, పావ్స్, క్రీమ్‌రోల్స్ తదితర బేకరీ ఉత్పత్తులు మోడ్రన్ ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి.