బిజినెస్

ఇది విద్యుదుత్పాదక సైకిల్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్ మనోజ్ భార్గవ.. శుక్రవారం ఇక్కడ ఓ సరికొత్త సైకిల్‌ను ఆవిష్కరించారు. ఇది విద్యుదుత్పత్తి చేసే సైకిల్ కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఈ సైకిల్ ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా భార్గవ అన్నారు. ‘ఈ సైకిల్ విద్యుదుత్పత్తిని చేస్తుంది. దీని పెడల్స్‌ను తొక్కిన సమయంలో చక్రాలు తిరిగి విద్యుత్ జనిస్తుంది. ఆ విద్యుత్ సైకిల్‌కున్న బ్యాటరీని చార్జింగ్ చేస్తుంది.’ అని వివరించారు. గంట సేపు తొక్కితే ఓ ఇంటికి అవసరమైన ఒకరోజు విద్యుత్ అవసరాలను తీర్చుకోవచ్చన్నారు. లైట్లు, ఓ చిన్న ఫ్యాన్, సెల్‌ఫోన్ చార్జీంగ్‌లను విద్యుత్ బిల్లులు లేకుండానే, ఎలాంటి కాలుష్యంగాని, ఇంధన వ్యయంగాని అక్కర్లేకుండానే చేసుకోవచ్చన్నారు. అయితే దీని గురించి ఏడాది క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించానని భార్గవ తెలిపారు. అయితే ప్రభుత్వ సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు మాత్రం ఆయన అంతగా ఉత్సాహం కనబరచలేదు. కాగా, వచ్చే ఏడాది మార్కెట్‌లో అందుబాటులో ఉండే దీని ధర 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలుగా ఉండొచ్చన్నారు. ఈ రకం ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల మంది వినియోగిస్తున్నారన్న భార్గవ.. భారత్‌లో తొలుత దీన్ని ఉత్తరాఖండ్‌కు పరిచయం చేస్తామన్నారు. అది మిగులు విద్యుత్ రాష్టమ్రే అయినప్పటికీ గ్రామీణ ప్రజలు విద్యుత్ కష్టాలను అనుభవిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.