బిజినెస్

పర్యాటక రంగంలో ఆరు హబ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 7: రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడానికి ఆరు హబ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. స్థానిక పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా ఎకో, ఆధ్యాత్మిక, బీచ్, బ్యాక్‌వాటర్ పర్యాటకాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ విశాఖపట్నం, రాజమహేంద్రవరం-కాకినాడ-కోనసీమ, విజయవాడ-అమరావతి, తిరుపతి-పులికాట్-నెల్లూరు, అనంతపురం-కడప, కర్నూలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి కేంద్రాలుగా గుర్తించామన్నారు. రాజమహేంద్రవరం హబ్‌లో కోరింగ, హోప్ ఐలాండ్ ప్రాంతాలను, మారేడుమిల్లి, కొల్లేరు, పోలవరం ప్రాంతాలను ఈకో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని పేరుపాలెం, తూర్పు గోదావరి జిల్లాలోని ఓడలరేవు ప్రాంతాలను బీచ్ పర్యాటక ప్రాంతాలుగా, తూర్పు గోదావరి జిల్లాలోని దిండి, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలవెల్లి ప్రాంతాలను బ్యాక్ వాటర్ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిచేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. రాజమహేంద్రవరం పరిధిలోని పిచ్చుకల్లంకను, గోదావరి హారతి కార్యక్రమాలను పర్యాటకంగా వెలుగులోకి తేవడంతోపాటు గోదావరిలో లేజర్ షోలను నిర్వహిస్తామన్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని పుష్కరవనాన్ని కూడా పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటకరంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకోసం 21 రకాల అనుమతులను సింగిల్ విండో విధానంలో మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తమ శాఖ, ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులకు భూమార్పిడి అనుమతులు కూడా అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో సెంట్రల్‌జైలు స్థలంలో షాపింగ్‌మాల్, ఇతర హంగులతో రెండు వేల మందికి సరిపడేలా కనె్వన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నామన్నారు. కనె్వన్షన్ సెంటర్‌కు ఇప్పటికే బిడ్డింగ్‌లు పూర్తయ్యాయన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతంలో పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. భారీ ఎమ్యూజ్‌మెంట్ పార్కును ఏర్పాటు చేసేందుకు బెంగుళూరుకు చెందిన సంస్థ ఆసక్తి చూపిస్తోందన్నారు.