బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ‘ముడి చమురు’ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 5: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల క్షీణత మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 267.41 పాయింట్లు పతనమై 29,858.80 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 74.60 పాయింట్లు పడిపోయి 9,285.30 వద్ద నిలిచింది. దీంతో సెనె్సక్స్ 30 వేల స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 9,300 దిగువకు పరిమితమైంది. మరోవైపు ఈ వారం మొత్తంగా చూసినట్లైతే సెనె్సక్స్ 59.60 పాయింట్లు, నిఫ్టీ 18.75 పాయింట్లు దిగజారాయి. న్యూయార్క్‌లో బ్యారెల్ ముడి చమురు ధర ఐదేళ్ల కనిష్టాన్ని తాకుతూ 43.76 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది. ఈ పరిణామం భారత్‌సహా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. దీంతో నష్టాలు తప్పలేదు. చమురు రంగ సంస్థల షేర్లను మదుపరులు అమ్మేశారు. ఫలితంగా ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా షేర్ల విలువ 2.83 శాతం, 2.98 శాతం చొప్పున నష్టపోయాయి. గెయిల్ షేర్ విలువ కూడా 2.49 శాతం పడిపోయింది.
మెటల్, పిఎస్‌యు, ఎఫ్‌ఎమ్‌సిజి, పవర్ రంగాల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక ఆసియా దేశాల్లోని కీలక మార్కెట్లలో చైనా, హాంకాంగ్, తైవాన్ సూచీలు నష్టాలపాలవగా, జపాన్, దక్షిణ కొరియాలకు సెలవు. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు నష్టాల్లోనే కదలాడాయి.

త్రైమాసిక
ఆర్థిక ఫలితాలు

ఐషర్ మోటార్స్
న్యూఢిల్లీ, మే 5: ఐషర్ మోటార్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 460 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 342 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,888 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,532 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
అపోలో టైర్స్
అపోలో టైర్స్ ఏకీకృత నికర లాభం పన్నుల అనంతరం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 228.23 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 272.05 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 3,639.39 కోట్ల రూపాయలుగా, పోయినసారి 3,268.84 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
నీట్ టెక్నాలజీస్
ఐటి రంగ సంస్థ నీట్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 100.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 81.6 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 744.7 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారితో చూస్తే 8.5 శాతం పెరిగిందని సంస్థ తెలిపింది.
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 72.66 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 20.24 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 231.13 కోట్ల రూపాయలుగా, పోయినసారి 190.31 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ వివరించింది.
కాగ్నిజెంట్
ఐటి రంగ సంస్థ కాగ్నిజెంట్ నికర లాభం ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో 557 మిలియన్ డాలర్లుగా నమోదైంది. నిరుడు జనవరి-మార్చి త్రైమాసికంలో 441 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆదాయం ఈసారి 3.55 బిలియన్ డాలర్లుగా ఉంది. పోయినసారి 3.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది.
ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్
బిపిఒ సంస్థ ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 65.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 77.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 892.3 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 869.4 కోట్ల రూపాయలుగా సంస్థ తెలిపింది.
మోన్‌శాంటో ఇండియా
మోన్‌శాంటో ఇండియా లిమిటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 30.11 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 24.08 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 144.92 కోట్ల రూపాయలుగా, పోయినసారి 93.21 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ వివరించింది.
ఓరియంట్ సిమెంట్
సికె బిర్లా గ్రూప్ సంస్థ ఓరియంట్ సిమెంట్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 16.52 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 18.47 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 695.70 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 507.88 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.

ఏప్రిల్‌లో తగ్గిన
జెఎల్‌ఆర్ అమ్మకాలు
న్యూఢిల్లీ, మే 5: దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెలలో 2.3 శాతం క్షీణించాయి. ఈ ఏప్రిల్‌లో 40,385 యూనిట్లుండగా, నిరుడు ఏప్రిల్‌తో చూస్తే ఇది కాస్త తక్కువ. కాగా, దీనికి రెండు కారణాలున్నాయని, అందులో ఒకటి ఏప్రిల్ 1న పెరిగిన వెహికిల్ ట్యాక్స్ కంటే ముందే బ్రిటన్‌లో కస్టమర్లు కొనుగోళ్లు జరిపారని జెఎల్‌ఆర్ గ్రూప్ సేల్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆండీ గాస్ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. మరొకటి లాండ్ రోవర్ అమ్మకాల్లో అధికంగా ఉండే డిస్కవరీ మోడల్ విక్రయాలు తగ్గిపోయాయని చెప్పారు.
పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు
హెచ్‌పిసిఎల్, మిట్టల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ, మే 5: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్), దాని భాగస్వామి లక్ష్మీ నివాస్ మిట్టల్.. పంజాబ్‌లోని తమ భటిండా రిఫైనరీలోగల పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటునకు దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నారు.
హెచ్‌పిసిఎల్-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ (హెచ్‌ఎమ్‌ఇఎల్) ఆధ్వర్యంలో ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. 1.7 మిలియన్ టన్నుల నాఫ్తా క్రాకర్ యూనిట్ ఏర్పాటునకు ఈ జాయింట్ వెంచర్ ప్రణాళికలు చేస్తుండగా, దీన్ని భటిండా రిఫైనరీలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
8న హడ్కో ఐపిఒ
న్యూఢిల్లీ, మే 5: ఈ నెల 8 (సోమవారం)న హడ్కో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) రానుంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన హడ్కోలో వాటా విక్రయం ద్వారా ఖజానాకు 1,224 కోట్ల రూపాయల నిధులు వస్తాయని అంచనా. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అనేది ఓ ‘మినీరత్న’ సంస్థ. హడ్కో సంస్థ హౌసింగ్, అర్బన్ వౌలిక రంగ ప్రాజెక్టులకు రుణాలను సమకూరుస్తుంది.

కాల్స్ నాణ్యత పరిశీలనకు యాప్
న్యూఢిల్లీ, మే 5: కాల్స్ నాణ్యత కొలమానానికిగాను ఓ యాప్‌ను త్వరలో తెస్తామని టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం తెలియజేసింది. కాల్ పూర్తయిన తర్వాత టెలికామ్ ఆపరేటర్ సేవలపట్ల వినియోగదారుడు ఈ యాప్ ద్వారా తన రేటింగ్‌ను ఇవ్వవచ్చు. తద్వారా కాల్స్ నాణ్యతను తెలుసుకునేందుకు అవకాశముందని ట్రాయ్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దాని చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ చెప్పారు. ఇప్పటికే వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా అవాంఛిత కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌ల నిరోధానికి ‘డు నాట్ డిస్టర్బ్’ వ్యవస్థను తెచ్చినట్లు గుర్తుచేశారు. కస్టమర్ల ప్రయోజనాలే ట్రాయ్‌కి ప్రధానమని స్పష్టం చేశారు.

విలీనం దిశగా
ఎసిసి, అంబుజా సిమెంట్
న్యూఢిల్లీ, మే 5: ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీదారైన లఫర్జ్‌హోలీసిమ్‌కు చెందిన భారతీయ అనుబంధ సంస్థలు ఎసిసి లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా సమావేశమైన ఈ ఇరు సంస్థల బోర్డులు.. విలీనానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ముంబయి ఆధారిత ఎసిసి లిమిటెడ్ నిరుడు 11,158.34 కోట్ల రూపాయల రెవిన్యూను సాధించింది. మరోవైపు ఇదే సంవత్సరంలో గుజరాత్ కేంద్రంగా నడుస్తున్న అంబుజా సిమెంట్ రెవిన్యూ 9,267.82 కోట్ల రూపాయలుగా ఉంది.