బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్
న్యూఢిల్లీ, మే 6: హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 274 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే ఇది 8 శాతం అధికం. ప్రీమియంల ద్వారా ఆదాయం ఈసారి 892 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి కంటే 9 శాతం అధికమని సంస్థ తెలిపింది.
అజంతా ఫార్మా
అజంతా ఫార్మా ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 114.02 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 108.96 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 479.20 కోట్ల రూపాయలుగా, పోయినసారి 435.65 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
జిల్లెట్ ఇండియా
జిల్లెట్ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 105.82 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే ఇది 53.83 శాతం అధికం. నాడు 68.79 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఆదాయం ఈసారి 542.98 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి కంటే 9 శాతం అధికమని సంస్థ తెలిపింది. నిరుడు 468.64 కోట్ల రూపాయలుగా నమోదైందని వివరించింది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్
అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి-మార్ట్) స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 96.66 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 65.55 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 3,120.49 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,219.67 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఎల్‌అండ్‌టి టెక్ సర్వీసెస్
ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 96.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చితే 11.54 శాతం తక్కువ. ఆదాయం ఈసారి 816.4 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 693.2 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది.
అలెంబిక్ ఫార్మా
అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 93.04 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 90.83 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు ఈసారి 740.26 కోట్ల రూపాయలుగా, పోయినసారి 625.56 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ వివరించింది.
ఫైజర్ లిమిటెడ్
ఫైజర్ లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 68.04 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 87.21 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 481.97 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 563.57 కోట్ల రూపాయలుగా ఉందని ఫైజర్ లిమిటెడ్ తెలిపింది.
మెర్క్ లిమిటెడ్
మెర్క్ లిమిటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 14.82 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 8.40 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 236.92 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 215.54 కోట్ల రూపాయలుగా ఉందని మెర్క్ లిమిటెడ్ తెలిపింది.
వి-మార్ట్
వి-మార్ట్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆర్థిక త్రైమాసికం (జనవరి-మార్చి)లో 4.99 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 48 లక్షల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 252.58 కోట్ల రూపాయలుగా, పోయినసారి 178.05 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ వివరించింది.