బిజినెస్

ఇన్ఫోసిస్‌తో బంధం వీడదు: గోపాలకృష్ణన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, మాజీ సిఇఒ క్రిష్ గోపాలకృష్ణన్.. ఇన్ఫోసిస్‌లో తాను ప్రస్తుతం ఉద్యోగిగా లేనప్పటికీ, ఆ సంస్థతో తనకున్న బంధం మాత్రం ఎప్పటికీ విడిపోదన్నారు. ఉన్నతోద్యోగుల వేతనాల విషయంలో సంస్థ యాజమాన్యం, వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయబేధాలు నెలకొన్న నేపథ్యంలో గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక్కడ ఓ కార్యక్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన ఆయన ఇన్ఫోసిస్‌తో తనకున్న బాంధవ్యాన్ని గుర్తుచేశారు. ఇన్ఫోసిస్ ప్రయోజనాలు ఎల్లపుడూ తనకు ప్రధానమేనని స్పష్టం చేశారు. జీవితకాలం శ్రమించి నెలకొల్పిన సంస్థ నుంచి వ్యవస్థాపకులు దూరం కాబోరన్నారు.