బిజినెస్

దక్షిణ కాశ్మీర్‌లోని బ్యాంకుల్లో నిలిచిన నగదు లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 6: బ్యాంకులు లక్ష్యంగా మిలిటెంట్లు దాడులకు తెగబడుతుండటంతో దక్షిణ కాశ్మీర్‌లో దాదాపు 40 బ్యాంకు శాఖల్లో నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. పుల్వామ, షోపియన్ జిల్లాల్లోగల సమస్యాత్మక ప్రాంతాల్లోని శాఖల్లో నగదు లావాదేవీలు ఆగిపోయాయి. భద్రతా దళాల సూచనల మేరకు బ్యాంకింగ్ వర్గాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల జమ్ము అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఎల్లాక్వి దెహతి బ్యాంక్ శాఖలపై మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. కాగా, జమ్ము-కాశ్మీర్ బ్యాంక్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ నగదు లావాదేవీలు మినహా ఇతర అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. ఎటిఎమ్ సేవలకూ అంతరాయం లేదన్నారు.