బిజినెస్

విప్రోకు బయో దాడి బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు
రూ. 500 కోట్ల బిట్‌కాయిన్స్ డిమాండ్

బెంగళూరు, మే 6: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ, బెంగళూరుకు చెందిన విప్రోకు జీవాయుధాల దాడి బెదిరింపులు వచ్చాయి. ‘ఈ నెల 25కల్లా 500 కోట్ల రూపాయల విలువైన బిట్‌కాయిన్స్‌ను చెల్లించనట్లైతే మీ క్యాంపస్‌లపై బయలాజికల్ అటాక్స్ చేస్తాం.’ అంటూ విప్రోకు ఓ ఏకగ్రీవ ఈమెయిల్ అందింది. టాయిలెట్ సీట్లపై లేదా డ్రోన్ల ద్వారా, క్యాంటిన్లలో లభించే ఆహారం గుండా రిసిన్, నాచురల్ టాక్సిన్ ప్రయోగిస్తామని ఆ ఈమెయిల్‌లో అగంతకుడు హెచ్చరికలు చేశాడు. పేమెంట్ లింక్‌తో వచ్చిన ఆ ఈమెయిల్‌లో రాబోయే కొద్దిరోజుల్లో విప్రో ఆఫీసుల్లో ఒకదానికి రెండు గ్రాముల శాంపిల్‌ను కూడా పంపిస్తానని సదరు వ్యక్తి స్పష్టం చేశాడు.
మరోవైపు ఈ ఘటనపై విప్రో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెదిరింపుల నేపథ్యంలో తమ సంస్థ కార్యకలాపాలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పింది. ‘గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన బెదిరింపుల లేఖ నేపథ్యంలో స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం. మాకున్న అన్ని కార్యాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాం. సంస్థ కార్యకలాపాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నందున ఇంతకంటే వివరాలేమీ చెప్పలేం.’ అని ఓ ప్రకటనలో విప్రో తెలిపింది. కాగా, ఈ కేసును బెంగళూరు పోలీసు శాఖకు చెందిన సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోంది. సదరు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. అయినప్పటికీ ఈమెయిల్ బూటకమా? అన్నదాన్ని పోలీసులు కొట్టిపారేయలేకపోవడం గమనార్హం. ‘ఇది నకిలీ ఈమెయిలా? లేదా అన్నది మేము కనిపెడతాం.’ అని బెంగళూరు పోలీసు శాఖ అదనపు కమిషనర్ (క్రైమ్) ఎస్ రవి తెలిపారు. 2013లోనూ విప్రోకు ఓ బెదిరింపు వచ్చింది. బెంగళూరులోని సంస్థ క్యాంపస్‌లను పేల్చివేస్తామన్నదే ఆ బెదిరింపు. అయితే అది వట్టి బూటకమేనని తర్వాత తేలింది.