బిజినెస్

బ్రిటన్ బిలియనీర్లలో మన హిందుజాలే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 7: బ్రిటన్ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు అగ్రస్థానంలో నిలిచారు. నిరుడుతో పోల్చితే 3.2 బిలియన్ పౌండ్లు పెరిగిన వీరి సంపద.. ప్రస్తుతం 16.2 బిలియన్ పౌండ్లకు చేరింది. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’లో వెయ్యి మందికి చోటు దక్కగా, అందులో 40కిపైగా భారత సంతతివారే కావడం విశేషం. మొత్తం 134 మంది బిలియనీర్లలో 81 ఏళ్ల శ్రీచంద్ హిందుజా, 77 ఏళ్ల గోపిచంద్ హిందుజా సోదరులు టాప్‌లో నిలిచారు. చమురు, గ్యాస్, ఆటోమోటివ్, ఐటి, ఎనర్జీ, మీడియా, బ్యాంకింగ్, ప్రాపర్టీ, హెల్త్‌కేర్ రంగాల పరిశ్రమల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా హిందుజాల సంపద అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలోనే నిరుడు రెండో స్థానంలో ఉన్న హిందుజాలు.. ఈ ఏడాది ప్రథమ స్థానంలోకి వచ్చారు. ఇక ఈ ఏడాది రెండో స్థానంలో ఉక్రెయిన్ వ్యాపారవేత్త లెన్ బ్లవత్నిక్ ఉన్నారు. ఈయన సంపద విలువ 15.9 బిలియన్ పౌండ్లు. కాగా, భారత సంతతి సోదరులే అయిన డేవిడ్, సిమన్ రూబెన్ మూడో స్థానంలోకి పడిపోయారు. వీరి సంపద ఇప్పుడు 14 బిలియన్ పౌండ్లుగా ఉంది. నిరుడు వీరు మొదటి స్థానంలో ఉన్నారు. మరోవైపు ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ 13.2 బిలియన్ పౌండ్లతో నాలుగో స్థానంలో నిలిచారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్) ఆ దేశ బిలియనీర్లపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపలేదని, పైగా నాటి నుంచి 14 శాతం సంపద పెరిగిందని, రికార్డు స్థాయిలో 658 బిలియన్ డాలర్లను తాకిందని తాజా జాబితాలో ది సండే టైమ్స్ చెప్పింది. కాగా, శ్రీ ప్రకాశ్ లోహియా, అనిల్ అగర్వాల్, సునీల్ వాస్వాని, ఆయన కుటుంబం, సిమన్, బాబీ, రాబిన్ అరోరా, నవీన్, వర్ష ఇంజినీర్స్ ఫార్మాస్యూటికల్స్, జస్మిందర్ సింగ్ బిలియనీర్ల జాబితాలో ఈసారి స్థానం సంపాదించారు.