బిజినెస్

ఆర్థిక ఫలితాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: ఈ వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా త్రైమాసిక ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయర్‌టెల్‌తోపాటు ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరోమోటోకార్ప్, ఏషియన్ పెయంట్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సంస్థలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయ. దీంతో వీటి ప్రకారం మదుపరు లు తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు స్థూల ఆర్థిక గణాంకాలు, ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు కూడా కీలకమేనని నిపుణులు చెబుతున్నారు. ‘త్రైమాసిక ఫలితాలు ఈ వారం ట్రేడింగ్ సరళిపై అధిక ప్రభావం చూపవచ్చు.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. కాగా, శుక్రవారం మార్కెట్ ట్రేడింగ్ పూర్తయ్యాక మార్చి నెలకుగాను విడుదలయ్యే పారిశ్రామికోత్పత్తి గణాంకాలూ ముఖ్యమేనన్న అభిప్రాయాలు మార్కెట్ విశే్లషకుల నుంచి వినిపిస్తున్నాయ. శుక్రవారమే గత నెల ఏప్రిల్ నెలకుగాను వినియోగదారుల ధరల సూచీ ఆధారిత (సిపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడుతున్నాయ. దీంతో వీటి ప్రభావం కూడా మార్కెట్లపై కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయ.
ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య మరే ఇతర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా దాని ప్రభావం భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై తప్పక కనిపిస్తుందని అంటున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్య గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 59.60 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.75 పాయంట్లు నష్టపోయనది తెలిసిందే.