బిజినెస్

త్వరితగతిన రుణాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యొకహామ (జపాన్), మే 7: రుణాల మంజూరు, అలాగే ఆసియా ప్రాంతంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల వౌలిక రంగాభివృద్ధికి సాయం విషయంలో చాలా సమయం పడుతోందని, దీన్ని తగ్గించుకోవాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి)ను భారత్ కోరింది. ఎడిబి బోర్డ్ ఆఫ్ గవర్నర్ల బిజినెస్ సెషన్‌లో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ సమాజ హితానికీ నిధులను ఎడిబి పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అంతేగాక దక్షిణాసియా దేశాల కోసం ఓ ప్రాంతీయ హబ్‌ను న్యూఢిల్లీలో ఎడిబి ఏర్పాటు చేయాలని కూడా జైట్లీ ఈ సందర్భంగా కోరారు. ఈ క్రమంలోనే రుణాల మంజూరు ఆలస్యమవుతోందని, ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌లో 67 సభ్య దేశాలుండగా, వీటిలో 48 దేశాలు ఆసియా, పసిఫిక్ రీజియన్‌కు చెందినవే.
1966 డిసెంబర్ 19న ఎడిబిని నెలకొల్పారు. ఆసియా-పసిఫిక్ దేశాల్లోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఎడిబి ముందుకెళ్తోంది. మరోవైపు జపాన్ ఆర్థిక శాఖ మంత్రి టరో అసోతో ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా నిర్వహించారు. ఇరు దేశాల ఆర్థికపరమైన అంశాలను చర్చించారు.