బిజినెస్

మరింత ముందుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 7: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మున్ముందు కూడా మెరుగైన స్థానంలోనే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. వచ్చే (2016-17) ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ చైనా కంటే ఒక పర్సెంటేజీ పాయింట్ అధికంగా 7.8 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై ప్రపంచ బ్యాంకు ప్రతి ఆరు నెలలకోసారి నివేదికలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 2015లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును -0.2 శాతం, 2016, 2017 సంవత్సరాల్లో -0.1 శాతం చొప్పున ప్రపంచ బ్యాంకు స్వల్పంగా తగ్గించినప్పటికీ చైనాలో వృద్ధిరేటు మరింత మందగించనున్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మున్ముందు కూడా మెరుగైన స్థానంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆసియాలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగివున్న భారత్ 2016-17లో 7.8 శాతం, ఆ తర్వాత రెండేళ్లు 7.9 శాతం చొప్పున వృద్ధిరేటును సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
2015లో చైనా 6.9 శాతం (జూన్‌లో అంచనా వేసిన దానికంటే ఇది 0.3 శాతం తక్కువ) వృద్ధి రేటు సాధిస్తుందని భావిస్తున్న ప్రపంచ బ్యాంకు 2016లో ఇది 6.7 శాతానికి, 2017, 2018 సవత్సరాల్లో 6.5 శాతానికి దిగజారుతుందని అంచనా వేస్తున్నట్లు తన తాజా నివేదికలో వెల్లడించింది. 2016లో కూడా రష్యా, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలోనే కొనసాగుతాయని, అయితే ప్రపంచంలోని ప్రధాన వర్థమాన దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిరేటుతో మెరుగైన స్థానంలో కొనసాగుతుందని, పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలంగా ఉండటం, ఇటీవల చమురు ధరలు తగ్గి వాస్తవ ఆదాయాలపై సానుకూల ప్రభావం చూపుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. గత కొద్ది సంవత్సరాల నుంచి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు ఎన్నో తీవ్రమైన ఆటుపోట్లతో సతమతమవుతున్నప్పటికీ వాటన్నింటినీ సమర్ధవతంగా తట్టుకుని నిలబడగలిగిన భారత్‌లో కరెన్సీ, స్టాక్ మార్కెట్లు గత ఏడాది కంటే మెరుగుపడిన విషయాన్ని ప్రపంచ బ్యాంకు ఈ సందర్భంగా గుర్తు చేసింది. మరోవైపు ఆర్‌బిఐ (్భరత రిజర్వు బ్యాంకు) ద్రవ్య నిల్వలను పునర్‌నిర్మించడం, విదేశీ ప్రత్య పెట్టుబడుల ప్రవాహం సానుకూలంగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమైందని, అలాగే 2009లో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో గరిష్ఠంగా 7.6 శాతంగా ఉన్న ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రభుత్వం చేపట్టిన ద్రవ్య స్థిరీకరణ చర్యల వలన ప్రస్తుతం దాదాపు 4 శాతానికి దిగివచ్చిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది.