బిజినెస్

ఈసారి భారత్ వృద్ధిరేటు 7.2 శాతం: ప్రపంచ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2019-20 నాటికి 7.7 శాతానికి పెరగవచ్చని సోమవారం పేర్కొంది. బలమైన ఆర్థిక మూలాలు, సంస్కరణలు, విదేశీ పెట్టుబడుల రాక భారత్‌కు కలిసొస్తున్నాయని అభిప్రాయపడింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదైనది తెలిసిందే.

వచ్చే వారం
పారిస్ పర్యటనకు జైట్లీ
న్యూఢిల్లీ, మే 29: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే వారం పారిస్ పర్యటనకు వెళ్తున్నారు. పన్ను ఎగవేతపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒఇసిడి) ఒప్పందాన్ని ఈ సందర్భంగా కుదుర్చుకోనున్నారు. వచ్చే నెల 7 నుంచి మొదలయ్యే ఈ మూడు రోజుల పర్యటనలో ఒఇసిడి మినిస్టీరియల్ కౌన్సిల్ సమావేశంలో జైట్లీ పాల్గొంటారు. అంతర్జాతీయ పరిణామాలపై ఈ సందర్భంగా చర్చ జరుగుతుంది.