బిజినెస్

ఈ ఏడు.. ఉపాధి మెండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: భారత కార్పొరేట్ రంగంలో ఈ సంవత్సరం ఉద్యోగాల కల్పన పుంజుకుంటుందని ఒక నివేదిక అంచనా వేసింది. 2017లో తగ్గిపోయిన ఉద్యోగాల కల్పన 2018లో 10 నుంచి 15 శాతం మేరకు పుంజుకుంటుందని పేర్కొంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2018 ప్రకారం, ఈ సంవత్సరం కార్పొరేట్ రంగంలో ఉద్యోగాల కల్పన సానుకూలంగా ఉంటుంది. 10 నుంచి 15 శాతం వరకు పుంజుకుంటుంది. 120 మందికి పైగా యాజమాన్యాల నుంచి ఉద్యోగాలకు సంబంధించిన ఉద్దేశాలు, దేశవ్యాప్తంగా గల 5,10,000 మంది విద్యార్థుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. హెచ్‌ఆర్ టెక్నాలజి సొల్యూషన్స్ కంపనీ పీపుల్‌స్ట్రాంగ్, స్కిల్ అసెస్‌మెంట్ సంస్థ వీబాక్స్‌లు పీర్సన్, సీఐఐ, ఏఐసీటీఈ, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, ఏఐయూలతో కలిసి సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. మునుపెన్నడూ లేనంతగా గత అయిదేళ్లలో అత్యధికంగా 45.6 శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయని నివేదిక వెల్లడించింది. ‘దేశం పరివర్తన దశలో ఉంది. మన జీవితాలపై డిజిటల్ ప్రభావం ఉంది. ఈ దశను విజయవంతంగా పూర్తి చేయడానికి సప్లై వైపు, డిమాండ్ వైపు ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. మనం సరయిన మార్గంలోనే ఉన్నామని గణాంకాలు వెల్లడిస్తున్నాయి’ అని పీపుల్‌స్ట్రాంగ్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పంకజ్ బన్సల్ అన్నారు. ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లు అత్యధిక ఉపాధి అవకాశాలు గల తొలి పది రాష్ట్రాలలో ఉన్నాయని కూడా ఆ నివేదిక వెల్లడించింది. భారత ఐటీ హబ్ బెంగళూరు ఉద్యోగాల కల్పన విషయంలో తన కీలక స్థానాన్ని నిలబెట్టుకున్నది. బెంగళూరు ఉపాధి కల్పనలో అగ్ర స్థానంలో ఉందని సర్వే తేల్చింది. చెన్నై, ఇండోర్, లక్నో, ముంబయి, నాగ్‌పూర్‌లు వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ ఏడో స్థానంలో నిలిచింది. దాని తరువాత స్థానాల్లో పుణే, తిరుచిరాపల్లి ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న నగరంగా నిలిచింది. ఇక్కడ మూడింట రెండు వంతుల మంది ఉపాధి పొందుతున్నారు. 18-25 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో 46 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. 26-29 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో 26 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. మొత్తం మీద 40.44 శాతం ఉన్న ఉపాధి అవకాశాలు గత సంవత్సరం 45.60 శాతానికి పెరిగాయి.