బిజినెస్

ఆంధ్రా ఫిషరీస్‌లో కొత్త సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు చెరువుల్లో పెంచుతున్న బొచ్చు, కట్లా, శీలావతికి కాలం చెల్లిందని చెప్పవచ్చు. వీటికి దేశీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా మరింత డిమాండ్ ఉన్న మత్య్సజాతి పై ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్‌లోకి కొత్త సిరీస్‌ని ఆహ్వానించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మత్య్స రైతులతో జరిగిన సమావేశంలో ఆ శాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ ప్రకటించారు.
భువనేశ్వర్ నుంచి జయంతి రోహు తల్లి చేపలు
భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్న చేపల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న చేప జయంతి రోహు. దీనిని ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చర్ ( సిఫా) 1997లో పరిశోధనలు పూర్తి చేసి జతంతి రోహు అనే చేప మంచి ఫలితాలను ఇస్తుందని ప్రకటించింది. దీనికి ముందు రోహు అనే చేప కూడా ఉంది. కాని పరిశోధనల్లో జయంతి రోహు చేప అన్ని చేపల కంటే 17శాతం ఎదుగుదల ఎక్కువని తేల్చింది.
దీంతో మత్స్య రైతులు దీని పెంపకాన్ని చేపట్టారు. కాగా దేశంలోని దేశీయ మార్కెట్‌లో ఈ చేప ప్రస్తుత తరుణంలో చాలా తక్కువగానే కనిపిస్తోంది. దీని పైన దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఇక్కడ వాతావరణానికి ఇది అనుకూలంగా భావించి ప్రస్తుతం పెంచుతున్న బొచ్చు, కట్లా, శీలావతి నుంచి జయంతి రోహుకు మార్పు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం భువనేశ్వర్ నుంచి తల్లి చేపలను దిగుమతి చేసుకోనున్నారు. జయంతి రోహుతో పాటు విదేశాల్లోని కొన్ని రకాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.
రెండు పంటలతో రైతుకు, ప్రభుత్వానికి
పెరగనున్న ఆదాయం
ప్రస్తుతం చేపల చెరువుల్లో పెంచుతున్న రకాలతో రైతులకు ఎక్కువ సమయం పడుతోంది. పిల్లలను తీసుకువచ్చి బరువు, ధర వచ్చేంత వరకు కూడా చెరువుల్లోనే వదిలేస్తున్నారు.
ఆ విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మరింత ఆదాయం సమకూర్చాలన్న ఉద్దేశ్యంతో కొత్త ఆలోచన చేశారు. దీంతో జయంతి రోహు చేప పిల్లలు సుమారు 50 గ్రామాల వరకు మత్స్యశాఖ నిర్ధేశించిన చేపల హ్యాచరీల్లో పెంపకం చేపడతున్నారు. హ్యాచరీల ద్వారా రైతులకు అందిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్ల పెరిగే సమయం తగ్గుతోంది, ఆ తరహా పిల్లలు ఎక్కువ దిగుబడి, రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫలితం గా చేపల పెంపకం చేసుకునే రైతులు ఏడాదికి రెండుసార్లు వరి మాదిరిగా చేపల సాగును చేసుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో రైతులు 10 నుంచి 20 శాతం మంది జయంతి రోహు చేపల పెంపకంతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జయంతి రోహు పెంపకాన్నిమత్స్యశాఖ చేపట్టనుంది.
chitram...
చెరువులోకి చేపలను వదులుతున్న దృశ్యం, జయంతి రోహు చేప