బిజినెస్

ఐడిబిఐ బ్యాంక్‌లో ప్రైవేటీకరణ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 27: ప్రభుత్వరంగ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ ఉద్యోగులు రోడ్డెక్కారు. బ్యాంకును ప్రైవేటీకరించాలనుకుంటున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం ఒకరోజు సమ్మెను చేపట్టారు. సర్కారు ఆలోచనను వ్యతిరేకిస్తూ 30 వేలకుపైగా ఉన్న బ్యాంక్ సిబ్బంది ప్లకార్డులను ప్రదర్శించారు. యాక్సిస్ బ్యాంక్ మాదిరిగానే ఐడిబిఐ బ్యాంక్‌నూ ప్రైవేటీకరించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. దీంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడిబిఐ ఆఫీసర్స్, ఎంప్లారుూస్ పేరిట బంద్ నిర్వహించారు. దీనికి అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం మద్దతు తెలిపింది. కాగా, ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 76.5 శాతం వాటా ఉంది. ‘ఐడిబిఐ బ్యాంక్‌లో ఉన్న వాటాను ప్రైవేట్‌రంగానికి అమ్మేయాలని ప్రభుత్వం చూస్తోంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాల విక్రయం ద్వారా 69,500 కోట్ల రూపాయల నిధులను ఖజానాకు తరలించాలని పెట్టుకున్న లక్ష్యాన్ని ఐడిబిఐ బ్యాంక్ వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వం సాధించాలనుకుంటోంది.’ అని యూనియన్ సభ్యులొకరు అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి బ్యాంకుకు ఎలాంటి సమాచారం లేదని ఓ ఐడిబిఐ అధికారి చెప్పారు. 2003లో పార్లమెంట్ ఆమోదంతో ఐడిబిఐ బ్యాంక్ అవతరించింది. అంతకుముందు ఇది ఓ ఫైనాన్షియల్ సంస్థగా ఉండేది. కాగా, బ్యాంక్ లావాదేవీలు, లాభాలు, నిరర్థక ఆస్తులు తదితర అంశాల దృష్ట్యా దీన్ని దశలవారీగా ప్రైవేటీకరించాలనుకుంటున్నట్లు ఈ సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గత నెల నవంబర్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సైతం విలేఖరులతో యాక్సిస్ బ్యాంక్ మాదిరిగా ఐడిబిఐ బ్యాంక్‌నూ ప్రైవేటీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీంతో దీనికి సంబంధించి బ్యాంకుకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ ఉద్యోగుల్లో భయం మొదలైంది. అందులోభాగంగానే శుక్రవారం బంద్ నిర్వహించారు. ఇదిలావుంటే యాక్సిస్ బ్యాంక్‌లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా 29.19 శాతం వాటా ఉంది. ఎస్‌యుయుటిఐ, ఎల్‌ఐసి, మరో నాలుగు ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈ వాటాను కలిగి ఉన్నాయి.