బిజినెస్

నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. అంతకుముందు సోమవారం నష్టాలపాలైన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మంగళవారం 143.01 పాయింట్లు కోల్పోయి 24,682.03 వద్ద నిలవగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 53.55 పాయింట్లు పడిపోయి 7,510.30 వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 1.03 శాతం, మిడ్-క్యాప్ 0.94 శాతం దిగజారాయి. పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణం గణాంకాలతోపాటు, టిసిఎస్ ఆర్థిక ఫలితాల మధ్య మదుపరులు పెట్టుబడులకు దూరంగా ఉన్నారని మార్కెట్ నిపుణులు విశే్లషిస్తున్నారు. ఇక టెలికామ్, బ్యాంకింగ్, రియల్టీ, ఫైనాన్స్, మెటల్, చమురు, గ్యాస్, టెక్నాలజీ, ఇంధన రంగాల షేర్ల విలువ 1.93 శాతం నుంచి 0.72 శాతం క్షీణించింది. అయినప్పటికీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ షేర్ల విలువ 0.14 శాతం, 0.07 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.21 శాతం నుంచి 2.71 శాతం నష్టపోయాయి. చైనా సూచీ మాత్రం 0.20 శాతం పెరిగింది. మరోవైపు ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.43 శాతం నుంచి 1.2 శాతం లాభపడ్డాయి.