బిజినెస్

ఈ ఏడాది 10వేల కిలోమీటర్ల రహదార్ల నిర్మాణ ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: రహదారుల నిర్మాణానికి సంబంధించి నియమ నిబంధనలను సరళతరం చేసిన ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 10 వేల కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను అప్పగించాలని యోచిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వెల్లడించారు. ఈ విషయమై సంబంధిత భాగస్వాముల సమావేశం ముగిసిన అనంతరం న్యూఢిల్లీలో జైట్లీ విలేఖర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల నియమ నిబంధనలను సరళతరం చేసి వెసులుబాట్లతో కూడిన ఎన్నో అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వం ఇప్పటికే 6,800 కిలోమీటర్ల రహదారుల నిర్మాణ ప్రాజెక్టులను అప్పగించగలిగిందని, మార్చి నెల చివరి నాటికి ఈ ప్రాజెక్టులు 10 వేల కిలోమీటర్లకు పెరుగుతాయని భావిస్తున్నామని ఆయన తెలిపారు. రహదారుల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని, అయితే ఇటువంటి మెగా ప్రాజెక్టులను ఒకేసారి భారీగా అప్పగిస్తే సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్ రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున అన్ని విషయాలను గమనంలోకి తీసుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నామని అరుణ్ జైట్లీ చెప్పారు.
chitram...
న్యూఢిల్లీలో గురువారం రహదారుల నిర్మాణ రంగ భాగస్వాములతో జరిపిన సమావేశంలో ఎన్‌హెచ్‌ఎఐ చైర్మన్ రాఘవ చంద్రతో ముచ్చటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ