బిజినెస్

భారత ఆర్థిక వ్యవస్థ బలమైనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక మందగమనం మధ్య కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఎక్కడికీ పోదని, ఇతర దేశాలతో పోల్చితే ఈ విషయంలో ఓ మెట్టుపైనే ఉంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన ఇనె్వస్ట్ కర్నాటక 2016 సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్న కొన్ని అంశాలు భారతీయ ఆర్థిక వ్యవస్థను పాక్షికంగా ప్రభావితం చేస్తుండటం కలిసొస్తోందన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, మెటల్ కమోడిటీ ధరల పతనం భారతీయ ఎగుమతులను దెబ్బతీస్తున్నాయని, కరెన్సీ మార్కెట్‌ను ఒడిదుడుకులకు గురిచేస్తోందని, అయితే ఇతర దేశాలతో పోల్చితే ఇది తక్కువేనన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇది 7-7.5 శాతంగా ఉండొచ్చని అన్నారు. 2001, 2008, 2015 సంవత్సరాల్లో ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలోనూ భారత్ నిలదొక్కుకుందని ఈ సందర్భంగా జైట్లీ గుర్తుచేశారు. కాగా, భారత్‌కున్న రుణాలు ఆమోదయోగ్య స్థాయిలోనే ఉన్నాయని, వాటివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని జైట్లీ స్పష్టం చేశారు.