బిజినెస్

వచ్చేసారికి చూద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 1: ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) యథాతథంగానే ఉంచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఐదో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్‌బిఐ వెళ్ళలేదు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ద్రవ్యసమీక్షలో అనూహ్యంగా రెపో, రివర్స్ రెపోలను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈసారి విరామం ప్రకటించింది. అలాగే నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ని 4 శాతం వద్దే ఉంచింది. కాగా, ద్రవ్యోల్బణం అదుపు దృష్ట్యా సుధీర్ఘకాలం నుంచి రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను తగ్గించని ఆర్‌బిఐ.. ఈ ఏడాది ఆరంభం నుంచి వాటిని 1.25 శాతం చొప్పున దించినది తెలిసిందే. అయినప్పటికీ ఆ స్థాయిలో రుణగ్రహీతలకు బ్యాంకులు ప్రయోజనం చేకూర్చలేదని, కేవలం 0.60 శాతం మాత్రమే రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకర్లు తగ్గించారని ఆర్‌బిఐ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి వడ్డీరేట్లను తగ్గించడానికి బ్యాంకులు ఎన్నో అవకాశాలున్నాయంది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష దృష్ట్యానే కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించలేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలావుంటే ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రమాదకర స్థాయిలో ఉన్న మొండి బకాయిల (ఎన్‌పిఎ లేదా నిరర్థక ఆస్తులు) సమస్యలు ఆర్‌బిఐ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 2017 మార్చి నాటికి తగ్గుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు మొండి బకాయిలు 5.20 శాతం నుంచి 6.03 శాతానికి పెరిగాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) రిజర్వ్ కరెన్సీలోకి చైనా కరెన్సీ అయిన యువాన్‌ను తీసుకోవడంపట్ల స్పందిస్తూ దీని ప్రభావం భారత కరెన్సీ రూపాయిపైన పెద్దగా ఉండబోదన్నారు. అయినప్పటికీ కొంతమేర విలువ పడిపోయే వీలుందన్నారు. ఇకపోతే ఆర్థిక పరిస్థితులు కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, మున్ముందు మరింతగా ఇది కనిపిస్తుందన్న విశ్వాసాన్ని రాజన్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కావచ్చని ఆయన అంచనా వేశారు.
వడ్డీరేట్ల తగ్గింపునకు బ్యాంకర్ల సంకేతాలు
రుణాల వడ్డీరేట్ల తగ్గింపుపై బ్యాంకుల తీరుపట్ల ఆర్‌బిఐ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పలువురు బ్యాంకర్లు వడ్డీరేట్ల తగ్గింపునకు సంకేతాలిచ్చారు. ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర