బిజినెస్

‘గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ నోటిఫికేషన్‌ను రద్దు చేయండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు మీదుగా వెళ్లే గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌పై నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జయలలిత సోమవారం ఓ లేఖను రాశారు. ఈ ప్రాజెక్టు అలైన్‌మెంట్ ఎరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, నమక్కల్, ధర్మపురి, కృష్ణగిరి, సేలమ్ జిల్లాల రైతులను నష్టపరుస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని లేఖలో జయలలిత పేర్కొన్నారు. గతంలో ఈ విషయమై సుప్రీం కోర్టును తమిళనాడు ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నందున దీనిపై నిర్ణయం కేంద్రానిదేనని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పడంతో ఆ దిశగా జయలలిత ప్రయత్నాలు చేస్తున్నారు.

టాటా మార్కోపోలో మోటార్స్ ప్లాంట్ లాకౌట్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: టాటా మోటార్స్ అనుబంధ సంస్థల్లో ఒకటైన టాటా మార్కోపోలో మోటార్స్ తమ ధర్వాద్ ప్లాంట్‌లో లాకౌట్‌ను ప్రకటించింది. ఈ మేరకు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. వేతన సంప్రదింపులపై కార్మికులు చేపట్టిన అక్రమ సమ్మె నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటనలో టాటా మోటార్స్ పేర్కొంది. జనవరి 31 నుంచి కార్మికుల పెద్ద ఎత్తున పనికి రావడం లేదని చెప్పింది.