బిజినెస్

వ్యాపార పరిస్థితులు మెరుగవ్వాలి: మిట్టల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత్‌లో వ్యాపార పరిస్థితులు మెరుగవ్వాలని పారిశ్రామికవేత్త రాజన్ భారతీ మిట్టల్ అన్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ ప్రచారం చాలా ఎక్కువగా ఉందన్నారు. వ్యాపారానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడలేదన్న ఆయన స్టార్టప్స్, మధ్యశ్రేణి సంస్థల మనుగడకు పరిస్థితులు అనువుగా లేవన్నారు. మంగళవారం ఇక్కడ కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోటియాతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజన్ మాట్లాడుతూ చైనా మందగమనం మధ్య ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్ అవకాశాన్ని భారత్ చేజార్చుకుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలు మరింతగా పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ప్రచారం చాలా ఎక్కువగా ఉందన్నారు. అయితే వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఆశించిన మార్పు త్వరలోనే వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ అయిన రాజన్ భారతీ మిట్టల్.. పారిశ్రామిక సంఘం ఫిక్కీ మాజీ అధ్యక్షుడు కూడా అన్నది తెలిసిందే.