బిజినెస్

ఆయిల్ రిఫైనరీ పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: కువైట్‌కు చెందిన అల్ అఫ్రాజ్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ సౌద్ అల్ అఫ్రాజ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్‌లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, ఏపిలో పెట్టుబడులు పెడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు వివరించారు.
దాదాపు 974కిమీ పొడవైన సముద్ర తీరంతో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని, వౌలిక సదుపాయాలు కల్పించటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సౌత్ అల్ అఫ్రాజ్‌తో చెప్పారు. ఆయిల్ రిఫైనరీ వస్తే తమ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అనుబంధ రంగాల పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఏర్పడతాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా లభిస్తాయన్నారు. దీంతో ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన ముఖ్యమంత్రితో చెప్పారు. ఇదిలా ఉంటే అల్ అఫ్రాజ్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ వియత్నాంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆయిల్ రిఫైనరీ నిర్మిస్తోంది. ఈ కంపెనీ ఇంకా విద్యుత్ కేంద్రాల స్థాపనలో, స్థిరాస్థి రంగంలో ప్రసిద్ధి చెందింది. రాజధాని అమరావతిలో పెట్టుబడులకు అల్ అఫ్రాజ్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర పాల్గొన్నారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అల్ అఫ్రాజ్ గ్రూప్ చైర్మన్, ప్రతినిధులు