బిజినెస్

బ్యాంకుల ఏకీకృతంపై త్వరలో నిపుణుల కమిటీ: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్: దేశానికి అధిక బ్యాంకుల కంటే, బలమైన బ్యాంకుల అవసరమే ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకృత ఆలోచనను పరిశీలించడానికి త్వరలోనే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. శనివారం ఇక్కడ రెండవ జ్ఞాన సంగం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారుల కోసం ఎంప్లాయ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఇఎస్‌ఒపి) అమలుకు పరిశీలిస్తున్నామని, బ్యాంకింగ్ రంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిల సమస్య పరిష్కారానికి సర్ఫేసి చట్టం, డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ బలోపేతంపైనా దృష్టి పెట్టామని చెప్పారు. కాగా, శుక్రవారం జ్ఞాన సంగం వేదికగా బ్యాంకుల ఏకీకృతాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఎదుట నిరసన వ్యక్తం చేసినది తెలిసిందే.