బిజినెస్

ఈ నెలాఖర్లో దేశీయ మార్కెట్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ స్మార్ట్ఫోన్లు భారతీయ మార్కెట్‌లో ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి వస్తాయని సామ్‌సంగ్ మంగళవారం తెలిపింది. రూ. 48,900 నుంచి రూ. 56,900 వరకు వీటి ధరలుంటాయని సామ్‌సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ మను శర్మ ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఎస్7.. 5.1 అంగుళాల డిస్‌ప్లే, 3,000 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీతో వస్తుండగా, ఎస్7 ఎడ్జ్.. 5.5 అంగుళాల డిస్‌ప్లే, 3,600 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీతో పరిచయమవుతోం ది. అంతేగాక ఈ ఫోన్ల ద్వారా తొలిసారిగా సామ్‌సంగ్ డ్యూ యెల్-పిక్సల్ కెమెరాను స్మార్ట్ఫోన్ల శ్రేణిలో పరిచయం చేస్తోంది. 3డి గ్లాస్, మెటల్ బాడీతో, నీరు, దుమ్ము నిరోధక శక్తితో 4జిబి ర్యామ్‌తో ఎస్7, ఎస్7 ఎడ్జ్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ ఫోన్ల అంతర్గత మెమరీ సామర్థ్యం 32 జిబి ఉం డగా, అదనంగా మరో 200 జిబిని వేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

నేడు కంటైనర్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియాలో
5 శాతం ప్రభుత్వ వాటా విక్రయం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ కంటైనర్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియాలో బుధవారం 5 శాతం వాటాను కేంద్రం విక్రయిస్తోంది. ఈ అమ్మకంతో 1,165 కోట్ల రూపాయల నిధులు ఖజనాకు చేరే అవకాశాలున్నాయి. మంగళవారం సంస్థ షేర్ విలువ 1,226.65 వద్ద ముగిసింది. అయతే దీనికి 2.58 శాతం తక్కువకే అంటే 1,195 రూపాయలకు ఒక్కో షేర్ చొప్పున ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.