బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ఫార్మా దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దిగివచ్చిన రిటైల్, మైనస్‌లోనే ఉన్న హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లను లాభాల్లో నడిపించలేకపోయాయి. ఔషధ రంగ షేర్లలో నమోదైన అమ్మకాల ఒత్తిడితో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 253.11 పాయింట్లు పడిపోయి 24,551.17 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 78.15 పాయింట్లు కోల్పోయి 7,500 స్థాయికి దిగువన 7,460.60 వద్ద నిలిచింది. ఔషధ రంగ షేర్ల సూచీ 3.01 శాతం నష్టపోగా, లుపిన్ షేర్ విలువ అత్యధికం గా 7.59 శాతం, ఫైజర్ 3.15 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.96 శాతం, సిప్లా, 2.48 శా తం, సన్ ఫార్మా 2.33 శాతం మేర క్షీణించాయి. యుఎస్‌ఎఫ్‌డిఎ నుంచి లుపిన్ గోవా తయారీ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి పలు నోటీసులు అందడం, ముఖ్యమైన ఔషధాలపై ఫైజర్‌కు నిషేధాజ్ఞలుండటం ఫార్మా షేర్లను కుంగదీసింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కదలాడటం కూడా భారతీయ సూచీలను దెబ్బతీసింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.12 శాతం నుంచి 1.56 శాతం దిగజారగా, చైనా సూచీ మాత్రం 0.17 శాతం పెరిగింది. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.19 శాతం నుంచి 0.49 శాతం కోల్పోయాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ విషయానికొస్తే ఎఫ్‌ఎమ్‌సిజి, టెక్నాలజీ, ఐటి, ఆటో, ఫైనాన్స్, ఇండిస్ట్రియల్స్, టెలికామ్, యుటిలిటీస్ రంగాల షేర్ల విలువ 1.54 శాతం నుంచి 0.53 శాతం పతనమైంది. బ్యాంకింగ్, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ మాత్రం 0.36 శాతం నుంచి 0.29 శాతం పెరిగింది.

తుంగభద్ర హెచ్‌ఎల్‌సి
ఆధునీకరణకు రూ. 226.56 కోట్లు
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 15: అనంతపురం వద్ద తుంగభద్ర హై లెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సి) ఆధునీకరణకు రూ. 226.56 కోట్లను కేటాయించినట్లు ఆంధ్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యే వి ప్రభాకర్ చౌదరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, తుంగభద్ర కాల్వ ద్వారా వచ్చే నీరు ఆవిరి కాకుం డా ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టు నిర్మాణానికి 2014-15లో రూ. 75.28 కోట్లు, 2015-16లో రూ. 483.94 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భూ సమీకరణను వేగవంతం చేస్తామని, అటవీ శాఖ అనుమతిని పొంది పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది మే నాటికి గాలేరు నగరి మొదటి దశ, 2018 మార్చి నాటికి రెండవ దశను పూర్తి చేస్తామన్నారు.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్
పిఎఫ్ లావాదేవీలపై ఇపిఎఫ్‌ఒ విచారణ
న్యూఢిల్లీ, మార్చి 15: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) లావాదేవీల విచారణపై ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) దృష్టి సారించింది. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పిఎఫ్ విరాళాలపై త్వరలో దర్యాప్తును మొదలుపెడతామన్నది తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌ను ఇపిఎఫ్‌ఒ ఏర్పాటు చేసింది. ఈ స్క్వాడ్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పిఎఫ్ చెల్లింపులపై దర్యాప్తు చేయనుంది. నిజానికి సంస్థ పిఎఫ్ ఖాతాలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని కార్మిక మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ఇపిఎఫ్‌ఒ తాజా చర్యకు దిగింది. 2015 సెప్టెంబర్ నుంచి కింగ్‌ఫిషర్ పిఎఫ్ విరాళాలు నిలిచిపోయాయ. లిక్కర్ కింగ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రభుత్వరంగ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల మేర బకాయిపడి విమానయాన సేవలకు దూరమైనది తెలిసిందే. దీని ఉద్యోగులు సైతం ప్రస్తుతం తమ వేతన బకాయిల కోసం ఆందోళనలు చేస్తుండగా, రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నారంటూ బ్యాంకులు మాల్యాపై కోర్టులను కూడా ఆశ్రయించాయి. ప్రస్తుతం మాల్యా లండన్‌లో ఉండగా, పిఎఫ్ బకాయిలకు సంబంధించి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు తాజాగా ఇపిఎఫ్‌ఒ 7.62 లక్షల రూపాయల నోటీసును అందించింది.