బిజినెస్

అంకుర సంస్థలకు చేయూతనిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో ఆదర్శంగా, ఉత్తమ నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమకు తోడ్పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెజాన్‌ను కోరారు. మంగళవారం అసెంబ్లీ ఛాంబర్‌లో తనను కలిసిన అమెజాన్ వెబ్ సర్వీసు బృందంతో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కారాల్లో మిగిలిన రాష్ట్రాలకు ఎపి మార్గదర్శనం చేసేలా సహకారం అందించాలని బృందంతో అన్నారు. ‘మేము సమ్మిళిత వృద్ధిని సాధించాలని, ప్రజానీకంలో సంతృప్తి శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో రెండంకెల వృద్ధిని సాధించడానికి మేము సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కారాలను ఉపయోగించుకోదలిచాం.’ అని చంద్రబాబు అమెజాన్ బృందంతో చెప్పారు. బృందం ప్రతినిధి పీటర్ మూర్ మాట్లాడుతూ వెబ్ సర్వీసు ప్రత్యేకతలను వివరించారు. అత్యంత వేగంగా, సమర్థవంతంగా కంప్యూటింగ్ సేవలు అందించే సత్తా తమ సంస్థకుందని, ప్రపంచంలోని 190 దేశాల్లో తమకు పది లక్షల మంది వినియోగదారులున్నారని వివరించారు. ప్రస్తుతం వెయ్య ప్రభుత్వ సంస్థలు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలను పొందుతున్నాయని తెలిపారు. విశ్వవ్యాప్తంగా అంకుర సంస్థలు స్థాపించడానికి వాణిజ్య వ్యాపారవేత్తలు అమెజాన్‌ను విశ్వసనీయమైనదిగా భావిస్తున్నారని మూర్ పేర్కొ న్నారు. ఆంధ్రాలో అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి తాము రాష్ట్ర ప్రభుత్వానికి క్రియాశీలక సహకారం అందిస్తామని తెలిపారు. ‘మీ విజన్ అమలుకు తోడ్పాటు అందించడానికి, ప్రయోగాత్మకంగా పని చేసేందుకు మాకు ఇదొక సదావకాశం’ అని మూర్ అన్నారు. చంద్రబాబు దానికి స్పందిస్తూ, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తే ఒనగూరె ప్రయోజనాలను వివరించారు. తగిన ప్రతిపాదనలతో వస్తే కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. అమెజాన్ పబ్లిక్ పాల సీ విభాగ అధిపతి రోజర్ సోమర్ విల్లే, రీజనల్ మేనేజర్ ఆశిష్ బూబ్, ఎపి ప్రభుత్వ ఐటి సలహాదారు జెఎ చౌదరి తదితరులు పాల్గొన్నారు.