బిజినెస్

దళిత సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళితుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. శాసన మండలిలో 70 వ నిబంధన కింద సోమవారం సభ్యులు బాబూ రాజేంద్రప్రసాద్ తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానం చెబుతూ, వచ్చే 2016-17 ఆర్థిక సంవత్సరంలో సాంఘిక సంక్షేమానికి 3,236 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కేటాయింపుల్లో పెరుగుదల 28.13 శాతం ఉన్నట్టు వివరించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో అన్ని పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తామన్నారు. అయతే సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పథకాల్లో అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దళితుల జనాభా 84,69,278గా (జనాభాలో 17.08 శాతం) ఉందన్నారు. విద్యార్థుల విద్యాభ్యాసం కోసం స్కాలర్‌షిప్‌లు, బోధనా రుసుము చెల్లిస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు వేర్వేరు పథకాలు అమలు చేస్తున్నామని, దళితుల ఆర్థికాభివృద్ధికి ఎపి షెడ్యూల్ కులాల ఆర్థిక సంస్థ రుణాలను ఇస్తోందన్నారు. కార్పొరేషన్ ద్వారా ఈ సంవత్సరం వెయ్యికోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి రావెల తెలిపారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ‘స్కైట్రాక్స్’ అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 21: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాని (ఆర్‌జిఐఎ)కి బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఇండియా, సెంట్రల్ ఆసియాలో బెస్ట్ ‘స్కైట్రాక్స్’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సిఇఒ ఎస్‌జికె కిషోర్ మాట్లాడుతూ ఆర్‌జిఐఎకు వరుసగా ఏడుసార్లు అవార్డు దక్కడం హర్షదాయకమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న హైదరాబాద్ విమానాశ్రయానికి ప్రపంచ స్కైట్రాక్స్ అవార్డు లభించడం తమ సంస్థ సిబ్బంది శ్రమ, పట్టుదల కృషికి ఫలితమేనన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రపంచంలో మూడో స్థానానికి ఎదిగిన ఆర్‌జిఐఎ వివిధ కేటగిరిల్లో అవార్డులు అందుకుంటోందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్ట్‌లో పర్యావరణం, పారిశుద్ధ్యం, భద్రత వంటి చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తుందన్నారు. భవిష్యత్‌లో ఈ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే ఆదర్శ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామన్నారు.