బిజినెస్

దిగజారుతున్న చెరకు విస్తీర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో చెరకు విస్తీర్ణం బాగా దిగజారుతోంది. ప్రస్తుత సీజన్‌లో కనీస గిట్టుబాటు ధర కూడా లభించని పరిస్థితుల్లో చెరకు రైతులు ఇతర పంటలకు మళ్లేందుకు సిద్ధపడుతుండటంతో వచ్చే సీజన్‌లో విస్తీర్ణం 10 నుండి 20 శాతం తగ్గే పరిస్థితి కనిపిస్తోందని చెరకు రైతుల సంఘం నాయకుడు ఎన్‌ఎస్‌వి శర్మ ఆందోళన వ్యక్తంచేశారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 23 చక్కెర ఫ్యాక్టరీలు ఉంటే, వీటిలో సుమారు కోటి 20 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేయగల సామర్థ్యం ఉంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన క్రషింగ్‌ను బట్టి చూస్తే ఫ్యాక్టరీల సామర్థ్యంలో కేవలం 50 శాతం చెరకు దిగుబడి మాత్రమే వచ్చినట్టు సమాచారం అందుతోంది. చెరకు క్రషింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో తాజా పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే సీజన్‌కు ఫ్యాక్టరీల సామర్ధ్యంలో 40 శాతాన్ని మాత్రమే వినియోగించుకునే స్థాయికి చెరకు దిగుబడి దిగజారే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇప్పటి నుండైనా చెరకు సాగుపై దృష్టి కేంద్రీకరించకపోతే, క్రషింగ్ సీజన్ మొదలయిన తరువాత ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ధర గిట్టుబాటు కావటం లేదని రైతులు ఎంత మొరపెట్టుకున్నా ఈ సీజన్‌లో కూడా టన్నుకు రూ. 2,500 నుండి రూ. 2,700 మధ్యే ధరను చెల్లించారని, దీనివల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని శర్మ చెప్పారు. టన్నుకు కనీసం రూ. 4,000 నుండి రూ. 4,500 చెల్లించాలని రైతులు కోరుతున్నారు. చెరకు సాగు మినహా మరో దారిలేని వారు మాత్రమే సాగు చేపడుతున్నారని చెరకు రైతులు చెబుతున్నారు. చెరకు సాగును లాభసాటిగా మార్చాలంటే ఫ్యాక్టరీల ఉత్పత్తుల ప్రాధాన్యతలను మార్చాలని శర్మ అభిప్రాయపడ్డారు. చక్కెర ధరను పెంచలేనపుడు, మొలాసిస్ నుండి వచ్చే ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిచ్చి, దానినే ప్రధాన ఉత్పత్తిగా పరిగణించాలని సూచించారు.
రైతులు ఎకరం విస్తీర్ణంలో పండించే చెరకు వల్ల ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం లభిస్తోందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెరకు రైతుల కష్టాలు తెలియటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల జాబితాలో ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్న చెరకు ఇపుడు చిట్టచివరి స్థానానికి దిగజారిందని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించకపోతే వచ్చే సీజన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో చెరకు సాగు పరిస్థితి బాగా క్షీణిస్తుందని రైతులు చెబుతున్నారు.