బిజినెస్

తెలంగాణలో పెట్రో ఉత్పత్తుల సరఫరాను మెరుగుపరుస్తాం: ప్రధాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌పిజి, సిఎన్‌జి తదితర పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను చమురు మంత్రిత్వ శాఖ మెరుగుపరుస్తుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీనిచ్చారు. ‘తెలంగాణలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన క్రింద ఎల్‌పిజి కనెక్షన్లను కల్పిస్తున్నాం. ఇతర పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను కూడా మెరుగుపరుస్తున్నాం.’ అని బుధవారం ఈ విషయంపై ఇక్కడ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో సమావేశం అనంతరం ప్రధాన్ స్పష్టం చేశారు. ఉజ్వల యోజన ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్) ఉన్న కుటుంబాలకు ఒక్కో ఎల్‌పిజి కనెక్షన్ కోసం 1,600 రూపాయల ఆర్థిక సాయాన్ని చేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్-కడప, కడప-తిరుపతి
మార్గాల్లో ట్రూజెట్ విమానాలు
హైదరాబాద్, మార్చి 30: హైదరాబాద్ ఆధారిత ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్.. హైదరాబాద్-కడప-హైదరాబాద్, కడప-తిరుపతి మార్గాల్లో విమానాలను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే నెల 8 నుంచి ఈ మార్గాల్లో సర్వీసులను నడిపిస్తామని స్పష్టం చేసింది.
కాగా, ఈ మార్గాల్లో విమానాలను నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ ట్రూజెట్ కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో కడప ప్రముఖ వ్యాపార కేంద్రమని, విమానయాన సేవలు లేని ప్రాంతాలకు చేరువవ్వాలనే తమ లక్ష్యంలో భాగంగానే ఈ కొత్త సర్వీసులను తెస్తున్నామని, ఔరంగాబాద్, నాగ్‌పూర్ తర్వాత తమ విమానాలు నడుస్తున్న మూడో మార్గం ఇది అని ట్రూజెట్ ఆధ్వర్యంలో నడుస్తున్న టర్బో మెగా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వంకయలపాటి ఉమేశ్ తెలిపారు.

రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు: ఆర్‌ఐఎల్
ముంబయి, మార్చి 30: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. 4జి ఇంటర్నెట్, టెలికామ్ వెంచర్‌లో 1,50,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పెడుతోంది. మొబైల్ బ్రాడ్‌బాండ్‌కు సంబంధించి ప్రస్తుతమున్న సగటు వేగానికంటే 40 నుంచి 80 రెట్లు అధిక వేగంతో తమ