బిజినెస్

పట్టు, చేనేత ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, ఏప్రిల్ 12: పట్టు, చేనేత రంగంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు చేయడానికి అమెజాన్ కంపెనీతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమలు, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా పట్టు, చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద గల పట్టు, చేనేత సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. చీరలు, ధోవతులు, పట్టు వస్త్రాల తయారీ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అయతే కూలీ వివరాలపై అంసతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని కార్మికులు చెప్పగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టు వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో అమ్ముడుపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆన్‌లైన్ అమ్మకాలు చేయాలనుకుంటోందన్నారు. అంతే గాక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలన్న ధృక్పథం తో నందిపేట్ మండలంలోని లక్కంపల్లిలో ఫుడ్‌పార్క్‌ను మంజూరు చేశామన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభిస్తామ ని, దీంతో వేల కోట్ల వ్యాపారమేగాక వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఆర్మూర్‌లోని లెదర్ పార్క్ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్న మంత్రి.. పది రోజుల్లో రూ. 10 కోట్లు మంజూరు చేసి వౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపా రు. చెప్పుల తయారీని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తా మన్నారు. అంతకుముందు గోవింద్‌పేట్ గ్రామంలోని సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఆయన పరిశీలించారు.