బిజినెస్

ముంచుకొస్తున్న మాంద్యం పటిష్టమైన చర్యలే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 13: ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉత్పన్నమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) హెచ్చరించింది. ఈ పరిస్థితిని తగినవిధంగా ఎదుర్కొనేందుకు వీలుగా సమీకృత రీతిలో విధానపరంగా పట్టుతరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆర్థిక అనిశ్చితి, వస్తు ధరలు తగ్గడం, చైనా వృద్ధిరేటుపై ఆందోళన తదితర అంశాల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో మాంద్య పరిస్థితులు దాపురించే తీవ్రత పెరిగిందని బుధవారం ఓ తాజా నివేదికలో ఐఎమ్‌ఎఫ్ పేర్కొంది.
8-10 శాతం వృద్ధిరేటు భారత్ అందుకోగలదు: సుబ్రమణ్యన్
ఆర్థిక సంస్కరణలు కొనసాగితే భారత జిడిపి వృద్ధిరేటు 8-10 శాతం మధ్య నమోదు అవుతుందన్న విశ్వాసాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అర్వింద్ సుబ్రమణ్యన్ వ్యక్తం చేశారు. ‘ప్రపంచ చోదక శక్తిగా భారత్ ఎదుగుతుందనడానికి ఎలాంటి సంశయం అక్కర్లేదు. ఇప్పుడు కూడా జిడిపి వృద్ధి 8-10 శాతం మధ్య నమోదు చేసే సత్తా భారత్‌కుందన్నది నా అభిప్రాయం.’ అని వాషింగ్టన్‌లో సుబ్రమణ్యన్ చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తుత అమెరికా పర్యటనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌తోపాటు సుబ్రమణ్యన్ కూడా పాల్గొంటున్నారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) వార్షిక సమావేశాలకు వీరు హాజరవుతారు.

ముగిసిన ఆభరణాల వర్తకుల సమ్మె
ప్రభుత్వ హామీతో 42 రోజుల బంద్‌కు తెర

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఆభరణాల వర్తకులు ఎట్టకేలకు తమ సుధీర్ఘ సమ్మెను ముగించారు. బంగారు నగలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని వ్యతిరేకిస్తూ గత 42 రోజులుగా వ్యాపారులు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండబోవన్న హామీ ప్రభుత్వం నుంచి రావడంతో బుధవారం ఆందోనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24 వరకు బంద్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అఖిల భారత సరఫ సంఘం ఉపాధ్యక్షుడు సురీందర్ కుమార్ జైన్ పిటిఐకి తెలిపారు. వ్యాపారులు మార్చి 2 నుంచి సమ్మె చేస్తున్నది తెలిసిందే. మరోవైపు బుధవారం ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 200 రూపాయలు దిగజారి 29,200లకు చేరింది. వెండి మాత్రం కిలో ధర 1,400 రూపాయలు పెరిగి 38,200ల వద్ద స్థిరపడింది.