బిజినెస్

మాల్యా పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా మరో చి క్కులోపడ్డారు. ప్రభుత్వరంగ బ్యాం కైన ఐడిబిఐ బ్యాంకు నుంచి రూ. 900 కోట్లకుపైగా రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారన్న కేసులో మాల్యా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన అభియోగాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 కింద చర్య తీసుకోవలసిందిగా కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇడి లేఖ రాసినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. మాల్యాకు జారీ చేసిన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును రద్దు చేయాల్సిందిగా కూడా ఇడి ముంబయిలోని రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని కోరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదయిన కేసులో మాల్యా తమ దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని, అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఇడి అంటోంది. రాజ్యసభ సభ్యుడయినందున మాల్యాకు డిప్లొమాటిక్ పాస్ట్‌పోర్ట్‌ను జారీ చేశారు. అయితే ఆయన దానిని ఉపయోగించుకొని మార్చి 2న బ్రిటన్ వెళ్లిపోయారు. మాల్యాకు సహకరిస్తూ ఆయన వ్యక్తిగతంగా హాజరుకావడానికి మూడుసార్లు తేదీలను మార్చినప్పటికీ, ఆయన దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కాలేదని ఇడికి చెందిన అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఇడి విజ్ఞప్తి ఆమోదం పొందితే, ఆ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్రిటన్ అధికారులకు తెలియజేస్తుంది. మాల్యాను భారత్‌కు పంపించివేయాల్సిందిగా కోరుతుం