బిజినెస్

కొటక్ మహీంద్ర లాభం రూ. 1,055 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 11: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 15.62 శాతం పెరిగి 1,055.23 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 912.60 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం బ్యాంక్ స్పష్టం చేసింది. స్టాండలోన్ ఆధారంగా బ్యాంక్ లాభం 12 శాతం పెరిగి 695.78 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం 3,458.85 కోట్ల రూపాయలుగా నమోదైంది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం 3,045.45 కోట్ల రూపాయలుగా ఉందని బ్యాంక్ తెలిపింది. నిరుడు ఏప్రిల్ 1న ఐఎన్‌జి వైశ్యా బ్యాంక్‌ను 15,000 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్ర కొనుగోలు చేసినది తెలిసిందే. దీంతో దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఎమ్‌వి అగస్టా లగ్జరీ బైక్స్
ధర రూ. 50.10 లక్షలు
న్యూఢిల్లీ, మే 11: ఇటలీకి చెందిన సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ ఎమ్‌వి అగస్టా.. బుధవారం భారతీయ మార్కెట్‌కు సరికొత్త లగ్జరీ బైక్‌లను పరిచయం చేసింది. ఎక్స్‌షోరూం పుణె ప్రకారం వీటి ధర 16.78 లక్షల రూపాయల నుంచి 50.10 లక్షల రూపాయల మధ్య ఉంది. కినెటిక్ గ్రూప్ భాగస్వామ్యంతో దేశీయ మార్కెట్‌లో ఈ బైక్‌లను అగస్టా విక్రయించనుంది. కాగా, సూపర్‌బైక్ శ్రేణిలో ఎఫ్3-800సిసి, బ్రుటాలె-1090సిసి, ఎఫ్4 ఆర్‌ఆర్-1000సిసి బైక్‌లను తాజాగా అగస్టా ఆవిష్కరించింది.

ఐబాల్ చౌక ల్యాప్‌ట్యాప్
ధర రూ. 9,999
న్యూఢిల్లీ, మే 11: ఐబాల్ సంస్థ బుధవారం ఓ చౌక ధర ల్యాప్‌ట్యాప్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ‘కాంప్‌బుక్’ పేరిట పరిచయమైన దీని ధర 9,999 రూపాయలు మాత్రమే. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ భాగస్వామ్యంతో ఈ ల్యాప్‌ట్యాప్‌ను తీసుకొచ్చిన ఐబాల్.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 30 శాతం ఆదాయ వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలిపింది. అందరికీ ల్యాప్‌ట్యాప్‌లను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతోనే ఈ చౌక ల్యాప్‌ట్యాప్‌ను ఆవిష్కరించామని సంస్థ డైరెక్టర్, సిఇఒ సందీప్ పరశురామ్‌పురియా పిటిఐకి తెలిపారు.

బిఎమ్‌డబ్ల్యు 320ఐ పెట్రోల్ కారు
ధర రూ. 36.9 లక్షలు
న్యూఢిల్లీ, మే 11: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యు.. బుధవారం తమ లగ్జరీ సెడాన్ 320ఐ వెర్షన్‌లో పెట్రోల్ కార్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 36.9 లక్షల రూపాయలు. అలాగే 320ఐ లగ్జరీ లైన్ కారునూ బిఎమ్‌డబ్ల్యు ఈ సందర్భంగా ఆవిష్కరించగా, దీని ధర 42.7 లక్షల రూపాయలుగా ఉంది. కాగా, ఇప్పటికే 320ఐ డీజిల్ వెర్షన్ కారును భారత్‌లో బిఎమ్‌డబ్ల్యు అమ్ముతోంది.