బిజినెస్

కరవుతో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 6,50,000 కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: పది రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితులు.. దేశ ఆర్థిక వ్యవస్థకు కనీసం 6,50,000 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించి ఉండవచ్చని పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. వరుసగా గత రెండేళ్లుగా చోటుచేసుకున్న వర్షాభావ పరిస్థితుల మధ్య దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 256 జిల్లాలు, అక్కడ నివసిస్తున్న దాదాపు 33 కోట్ల మంది ప్రజలు కరవు బారినపడ్డారని అసోచామ్ అధ్యయనం తెలిపింది. కుంటలు, చెరువులేగాక జలాశయాల్లో సైతం నీరు అడుగంటిపోయిందన్న అసోచామ్.. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని, మహారాష్ట్ర, కర్నాటక తదితర పది రాష్ట్రాల్లో కరవు తీవ్రంగా ఉందని బుధవారం పేర్కొంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదైనా.. మరో ఆరు నెలలపాటు ఈ కరవు ప్రభావం ఉండవచ్చని అసోచామ్ అభిప్రాయపడింది. భూగర్భ జలాలు, నదులు, సరస్సులు సాధారణ స్థితికి రావాలంటే ఆ మాత్రం సమయం పడుతుందంది. కాగా, కరవుతో పిల్లలు, మహిళలు తీవ్రంగా ప్రభావితులైనట్లు చెప్పిన అసోచామ్.. వృక్ష, జంతుజాలం మనుగడకూ ముప్పు వాటిల్లినట్లు తెలిపింది. ఇక ఈ కరవు నేపథ్యంలో ఒక్కో వ్యక్తి ఆహార, నీటి, ఆరోగ్య అవసరాలకు కనీసం 3,000 రూపాయల చొప్పున ప్రభుత్వం వెచ్చించినా.. అది ఖాజానాపై దాదాపు లక్ష కోట్ల రూపాయల భారాన్ని మోపుతుందని, అలాగే విద్యుత్, ఎరువుల రాయితీలపై వచ్చే నష్టం, పారిశ్రామిక కార్యకలాపాలపై ఏర్పడే నష్టంతో కలిపితే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు 6,50,000 కోట్ల రూపాయల ఆదాయం దూరమైందని చెప్పింది.

మాక్స్‌బూపాతో
బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పందం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 11: సమగ్ర ఆరోగ్య బీమా పథకాలను అందించడంలో ప్రత్యేకత కలిగిన మాక్స్‌బూపాతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు ఆరోగ్య బీమా పథకాలను అందించేందుకు ఈ ఒప్పదం చేసుకున్నట్లు బ్యాంక్, మాక్స్ సంస్థలు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాంక్ ఖాతాదారులకు, రుణగ్రహీతలకు రూ. 50 వేల నుంచి రూ.క టి వరకు సులభమైన, కస్టమైజబుల్ బీమా పాలసీలను అందించడం జరుగుతుందని బరోడా బ్యాంక్ ఈడి మయాంక్ కె.మెహతా ఆ ప్రకటనలో తెలిపారు.

లీడ్ క్రాప్ సైన్స్ కొత్త ఉత్పత్తులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 11: భూసారాన్ని పరిరక్షించడంతోపాటు కీటకాల నుంచి పంటలను కాపాడేందుకు ఆర్గానిక్ ఎరువుల తయారీలో అగ్రగామిగా ఉన్న లీడ్‌క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం రెండు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. నానో టెక్నాలజీపై ఆధారపడి పనిచేసే జైలాన్, అసుక అనే రెండు కొత్త ఉత్పత్తులను లీడ్ క్రాప్ సైన్స్ ఎండి వినోద్ లహోటీ విలేకరుల సమావేశంలో మార్కెట్లోకి విడుదల చేశారు. ఆయా పంటలకు వచ్చే చీడపీడలను సమర్థవంతంగా ఈ కొత్త ఉత్పత్తులు నియంత్రిస్తాయని తెలిపారు.

పి-నోట్లకు వర్తించదు
మారిషస్ పన్ను సవరణపై అధియా
న్యూఢిల్లీ, మే 11: భారత్-మారిషస్ పన్ను ఒప్పందం సవరణ పి-నోట్లలోని పెట్టుబడులకు వర్తించదని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి భారత్‌లోకి మారిషస్ ద్వారా వచ్చే పెట్టుబడులపై పన్ను విధిస్తామని మంగళవారం ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించినది తెలిసిందే. ఈ క్రమంలో ఈ నిర్ణయం ప్రస్తుత పి-నోట్ల పెట్టుబడులపై ప్రభావం చూపబోదని అధియా బుధవారం పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా, నిరుడు ఏప్రిల్-డిసెంబర్‌లో భారత్‌లోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విలువ 29.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో మారిషస్, సింగపూర్ దేశాల నుంచి వచ్చినదే 17 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.