బిజినెస్

అధునాతన టెక్నాలజీతో కొత్త శాంసంగ్ ఎసి, రిఫ్రిజిరేటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: శాంసంగ్ ఇండియా స్మార్ట్ నూతన శ్రేణి ఎయిర్ కండీషనర్లు, స్మార్ట్ డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. బుధవారం నాడిక్కడ ఒక హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కొత్త ఉత్పత్తులను శాంసంగ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటాని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా 8 పోల్ మోటార్ శక్తివంతమైన డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ మిగిలిన ఏసిలతో పోలిస్తే 43 శాతం వేగంగా కూలింగ్ ఇస్తుందని, బాహ్య ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకుంటుందని తెలిపారు. తుప్పు పట్టనటువంటి మెటీరియల్స్‌తో డ్యూరాఫిన్ కండెన్సర్లు తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. రిఫ్రిజిరేటర్ల విభాగంలో విప్లవాత్మక స్మార్ట్ కన్వర్టబుల్ 5 ఇన్ 1, స్మార్ట్ డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లతో రెండు రకాల కొత్త రిఫ్రిజిరేటర్లను ఒకేసారి మార్కెట్లోకి ప్రవేశపెట్టామని తెలిపారు. ఆధునాతన టెక్నాలజీతో తయారు చేసిన ఈ రెండు రిఫ్రిజిరేటర్లు వివిధ సైజుల్లో, వివిధ ధరల్లో లభ్యమవుతాయని చెప్పారు. తక్కువ విద్యుత్ వినియోగంతో పాటు అవసరానికి తగినట్లుగా స్టోరేజీ కూలింగ్ సౌకర్యాన్ని ఈ రిఫ్రిజిరేటర్లు అందిస్తాయన్నారు. 5 ఇన్ 1 రిఫ్రిజిరేటర్ ట్విన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీతో శక్తివంతంగా పని చేస్తుందని, వినియోగదారులు ఏ అర వరకు కూలింగ్ కావాలనుకుంటే అక్కడ వరకు ఉంచుకుని మిగిలిన స్పేస్ నిలిపివేసుకునే సౌకర్యం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ రెండు రిఫ్రిజిరేటర్లు వినియోగదారులను ఆకట్టుకుని రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో తమ వాటాను పెంచుకుంటాయని తెలిపారు.

స్మార్ట్ ఎసి, డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లను పరిచయం చేస్తున్న శాంసంగ్ ప్రతినిధి

భారత్‌లోకి ఆరింతలు పెరిగిన చైనా దిగుమతులు
న్యూఢిల్లీ, మే 11: గడచిన దశాబ్ద కాలంలో భారత్‌లోకి చైనా దిగుమతులు ఆరింతలు పెరిగాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో చైనా దిగుమతుల విలువ 10.87 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 61.71 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మేరకు వివరాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. కంప్యూటర్ హార్డ్‌వేర్, డ్రగ్ ఇంటర్‌మీడియేట్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషినరీతోపాటు ఇనుము, ఉక్కు దిగుమతులు చైనా నుంచి భారత్‌కు అధికంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.